సంసద్ టీవీని ప్రారంభించిన మోదీ.. రెండు కలిపి ఒకటిగా

సంసద్ టీవీని ప్రారంభించిన మోదీ.. రెండు కలిపి ఒకటిగా

సంసద్ టీవీని ప్రారంభించిన మోదీ.. రెండు కలిపి ఒకటిగా

లోక్ సభ టీవీ, రాజ్యసభ టీవీ కలిపి సంసద్ టీవీ 

4 రకాలుగా ప్రసారం 

ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో సంసద్ టీవీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంసద్ టీవీ ప్రసారాలను ప్రారంభించారు. ఒకప్పుడు లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలను విడివిడిగా ప్రసారాలు చేసేవారు.. అయితే ఈ రెండింటిని కలిపి “సంసద్ టీవీ “ గా ఏర్పాటు చేశారు. అయితే పార్లమెంటు కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సంసద్ టీవీ కార్యకలాపాలను ప్రారంభించారు.

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంనాడు సంసద్ టీవీ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే ఈ  సంసద్ టీవీలో కార్యక్రమాలు 4 రకాలుగా ప్రసారమవుతాయి. పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు…పథకాలు, విధానాల అమలు, పాలన… భారత దేశ చరిత్ర, సంస్కృతి.. సమకాలిక స్వభావం గల సమస్యలు, ఆసక్తులపై కార్యక్రమాలు ప్రసారమవుతాయని తెలిపారు.

లోక్‌సభ టీవీ 2006 జూలైలో ఏర్పాటైంది. రాజ్యసభ టీవీ 2011లో ప్రారంభమైంది. ఈ చానల్‌లో రాజ్యసభ కార్యకలాపాలతోపాటు విజ్ఞానదాయక కార్యక్రమాలు కూడా ప్రసారమవుతుండేవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *