SBI పర్సనల్ లోన్ ఇక ఈజీ !

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పర్సనల్ లోన్స్ ఇచ్చే విధానాన్ని ఈజీ చేసింది. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ (ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణాలను ) SBI YONO యాప్ ద్వారా వేగంగా తీసుకోడానికి అవకాశం కల్పించింది. ఈ రుణాలు తమ ఖాతాదారులకు మాత్రమే ఇవ్వనుంది. అంతేకాదు… ఈ సౌకర్యం బ్యాంక్ కస్టమర్లకి 24X7 అందుబాటులో ఉండనుంది.
SBI కనిష్ఠ వడ్డీరేటు 9.60 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈనెలాఖరు అంటే జనవరి 31 వరకు ప్రాసెసింగ్ ఛార్జీలు పూర్తిగా మినహాయించనుంది. నాలుగు స్టెప్పుల్లో పర్సనల్ లోన్ పొండానికి అవకాశం ఉంది. వెంటనే లోన్ కూడా మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. మీరు ఫిజికల్ ఎలాంటి డాక్యుమెంట్స్ బ్యాంక్ కు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ బ్రాంచ్ చుట్టూ తిరగనక్కర్లేదు.
యోనో యాప్ ద్వారా లోన్ తీసుకోడానికి ఆ నాలుగు స్టెప్స్ ఏంటో చూద్దాం.
1. ముందుగా SBI YONO యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
2. అందులో Drop Down Menuలో… Avail Now బటన్‌పై క్లిక్ చేయాలి.
3. ఆ తర్వాత Loan Amount, Time period సెలక్ట్ చేసుకోవాలి.
4. మీ బ్యాంక్ అకౌంట్ కి లింకేజ్ అయిన మొబైల్ నంబర్‌కి వచ్చిన OTPని ఎంటర్ చేస్తే ప్రాసెస్ పూర్తయినట్టే. మీరు కోరుకున్న పర్సనల్ లోన్ అమౌంట్ మీ ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది.
అసలు మీకు అర్హత ఉందా ?
SBI వినియోగదారులు PAPL<స్పేస్>< చివరి 4 అంకెల SBI సేవింగ్స్ అకౌంట్ నెంబర్>> టైప్ చేసి 567676 నంబర్‌కు SMS చేస్తే… మీకు ఎంతవరకూ రుణం లభించే అవకాశం ఉంది… అసలు ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు