తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు ఓపెన్

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు ఓపెన్

తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు ఓపెన్

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు  తెలంగాణలో సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంకానున్నాయి. కరోనా కారణంగా మూతపడ్డ విద్యాసంస్థల పున: ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో చర్చలు జరిపిన అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అంగన్వాడీ సహా అన్ని రకాల ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ స్కూళ్లు పునఃప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అయితే ఈ స్కూళ్లను ఈనెల 30లోపు తరగతి గదులు, హాస్టళ్లు, అన్ని విద్యాసంస్థల శానిటైజేషన్‌ ప్రక్రియ పూర్తి వేగవంతం కావాలని ఆదేశించారు సీఎం కేసీఆర్

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లు తెరవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని.. దీనిపై మేధావులు, వైద్య విద్యాధికారులతో చర్చలు జరిపిన తరువాతే స్కూళ్లును ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. సూళ్లలో విద్యార్థులు కచ్చితంగా మాస్కులు ధరించేలా చూడాలనివిద్యాసంస్థల్లో తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి’’ అని స్పష్టం చేశారు.

అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు ప్రారంభమయ్యాని, ఇంకా ఎక్కువ కాలం స్కూళ్లు బంద్ చేస్తే పిల్లల్లో మానసిక పరివర్తనలో సమస్యలు వచ్చే ప్రభావముందని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే గత కొద్దికాలంగా ఆన్ లైన్లోనే విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని.. అయితే పూర్తి కాల పరిమితిలో.. ప్రత్యక్ష బోధన అనే అంశాలపై చర్చించామని.. స్కూళ్లు తెరవాలన్న అంశాలపై తర్జన భర్జన పడినప్పటీకీ స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోని  కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ఈ నెలలోనే స్కూళ్లు తెరుస్తున్నారనని వాటిన్నంటిని పరిశీలనలోకి తీసుకొని తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభించాలని ఆదేశాలిచ్చామని.. వీటిపై మార్గదర్శకాలు ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *