TS: కొవిడ్ నిబంధనల మధ్య స్కూళ్లు తెరవాలని నిర్ణయం

TS: కొవిడ్ నిబంధనల మధ్య స్కూళ్లు తెరవాలని నిర్ణయం

TS: కొవిడ్ నిబంధనల మధ్య స్కూళ్లు తెరవాలని నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకొని తగిన జాగ్రత్తలు పాటిస్తూ స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాలని.. ఎప్పటికప్పుడు విద్యా శాఖ అధికారులు స్కూళ్లపై పర్యవేక్షణ కలిగి ఉండాలని మంత్రి సబితా ఆదేశించారు.

సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సూచించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్‌ పూర్తి చేసేందుకు మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖల సహకారాన్ని తీసుకుని శుభ్రం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఒకవేళ కొవిడ్ నిబంధనలు పాటించనట్లయితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

అయితే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు తెరిచారని.. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు యాజమాన్యాలు శ్రద్ధ వహించి తగిన జాగ్రత్తల మధ్య స్కూళ్లు తెరవాలని.. కోవిడ్ పై  ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకుండా, చిన్నారులు పాఠశాలలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సిద్ధం చేయాలని మంత్రి కోరారు. అయితే తరగతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా స్కూళ్ల యాజమాన్యాలను అధికారులు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: