ఏపీలో ప్రారంభమైన స్కూళ్లు

- ఏపీలో 45ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్
- వ్యాక్సినేషన్ ప్రక్రియలో గర్భిణీలు, టీచర్లుకు ప్రాధాన్యత
- ఏపీలో ప్రారంభమైన స్కూళ్లు, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి
- కోవిడ్ నిబంధనలు ఉల్లఘిస్తే జరిమానాలు
- పెళ్లిళ్లకు 150 మందితోనే అనుమతి
కరోనా నేపధ్యంలో రాష్ట్రంలో స్కూళ్లు మూత పడడ్డాయి. థర్డ్ వేవ్ హెచ్చరికలతో మంత్రులతో సమీక్షీంచిన సీఎం జగన్. మంత్రులు, అధికారులు, రాష్ట్ర ప్రజానికానికి సూచనలు ఇచ్చారు. అయితే ఈనెల 16 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటూ ఆదేశించారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో మరో రెండు నెలల పాటు ఆంక్షలు విధించాలని అధికారులకు ఆదేశం. పెళ్లిళ్లు, మతపరమైన ఊరేగింపుల్లో ప్రజలు గుమికూడకుండా చూడాలని జాగ్రత్తలు పాటించాలని సూచనలు ఇచ్చారు. థర్డ్ వేవ్ హెచ్చరికలతో పెళ్లిళ్లకు 150 మందికే అనుమతి నివ్వాలంటూ సూచించారు.
రాష్ట్రంలో ఇంటింటికి యంత్రాంగం సర్వే కొనసాగించాలి. కోవిడ్ లక్షణాలుంటే RTPCR టెస్టులే చేయాలి. కోవిడ్ లక్షణాలుంటే 104కి సమాచార మిచ్చి సమర్థవంతంగా సేవలందిచేలా కృషి చేయాలని సూచించాలని అధికారులకు జగన్ ఆదేశం. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపధ్యంలో 45 ఏళ్లు పై బడినవారు, గర్భిణీలకు వ్యాక్సి నేషన్ ప్రక్రియలో ప్రాముఖ్యత నివ్వాలంటూ సీఎస్, వైద్యశాఖ అధికారులు సీఎం జగన్ సూచన.