స్వయం సహాయక సంఘాలకు మోడీ సర్కార్ మరింత చేయూత

స్వయం సహాయక సంఘాలకు  మోడీ సర్కార్ మరింత చేయూత

దేశంలో మహిళలు స్వశక్తిగా ఎదిగేందుకు మోడీ సర్కార్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. స్వయం సహాయక సంఘాలలోని మహిళల ఆదాయం పెంపు లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని కేంద్రం యోచన చేస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రతి ఏడాది రూ.లక్ష సంపాదించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందు కోసం ల్యాక్‌పతి SHG ఉమెన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.

మహిళలకు మరింత జీవనోపాధి:
కాగా వచ్చే రెండేళ్లలో 2.5 కోట్ల మంది గ్రామీణ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు జీవనోపాధిని కల్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ యోచన చేస్తోంది. ఈ పథకంతో గ్రామీణ జీవితాల్లో వెలుగులు నిండుతాయని.. దీంతో స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళల ఆదాయం తో పాటుగా..  జీవనోపాధి ప్రమాణాలు పెంపొందింది ఆర్థిక పరమైన, సామాజిక పరమైన చేయూత అందుతోందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఇప్పటికే 7.7 కోట్ల మంది మహిళలు 70 లక్షలకుపైగా స్వయం సహాయక గ్రూపుల్లో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయంతో మహిళలు ఆర్థికంగా మరింతగా ఎదిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: