శకునం మంచిదేనా..! శకునం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ..?  

శకునం మంచిదేనా..! శకునం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ..?  

శకునం మంచిదేనా..! శకునం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ..?  

మన హిందువు దేశంలో ఆచార్య సంప్రదాయాలు, మూఢ నమ్మకాలు, శకునాలను పాటించడంలో మన పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. కొంతమంది తిధి, వారం, నక్షత్రం లాంటివి కూడా క్షుణంగా చూసి మరి ముందుకు అడుగు వేస్తారు. సాధ్యం కానీ పక్షంలో శకునాలు, సంకేతాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మనం కానీ ఎవరైనాసరే కుటుంబ సభ్యులలో ఏ శుభ కార్యానికో, లేక బజారీకో బయల్దేరినా మంచి శకునం చూసుకునే బయల్దేరుతుంటారు పెద్దలు. అయితే మన పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకమేమిటంటే మంచి శకునం చూసుకుని వెళ్లడం వలన, తలపెట్టిన కార్యం ఎలాంటి అటంకం లేకుండా పూర్తవుతుందనే విశ్వాసం ప్రాచీన కాలం నుంచి వస్తున్నదే..

అయితే హిందువుల సంపద్రాయం ప్రకారం సాధారణంగా పుణ్యస్త్రీలు కానీ, మన ఇంట్లోని ఆడవాళ్లు కానీ ఎదురు వచ్చినప్పుడు మంచి శకునంగా భావించి బయలుదేరుతుంటారు. దీనిలో భాగంగానే నీళ్ల బిందెలతో స్త్రీలు ఎదురైనప్పుడు కూడా మంచి శకునంగానే భావించి అడుగుముందుకు వెళ్లడం జరుగుతోంది. దీన్ని కూడా మంచి శకునంగానే భావిస్తారు పెద్దలు.

మన శాస్త్రాల్లో ప్రయాణానికి బయల్దేరేటప్పుడు మగళాధ్వనులు వినిపించినా, గుడిలోని గంట శబ్ధాలు ధ్వని వినిపించినా, శుభప్రదమేనని మన శాస్త్రం చెబుతోంది. అయితే మనం ప్రయాణించేటప్పడు మన ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టేటప్పడు ఏదైనా శుభవార్త తెలిస్తే పిల్లా పాపాలతో కూడా దంపతులు.. నిస్సందేహంగా బయలుదేరవచ్చని అని అంటారు.

అయితే కొన్ని సందర్భాల్లో మనకు అనుకోకుండా ఆవులు, ఏనుగు, గుర్రం లాంటివి ఎదురైనా కూడా మనం తలెట్టిన కార్యం శుభప్రదంగా పూర్తవుతుందని పెద్దలు చెబుతుంటారు.

మనం ప్రయాణానికి బయల్దేరేటప్పుడు ఒకవేళ ఏదైనా శకునం చెడుగా అనిపించినా.. మన కుటుంబ సభ్యులలో ఎవరైనా మనకు చెడు వార్త చెబితే ఆ రోజు ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సిందే..కొంతమంది అవేవిపట్టించుకోకుండా వెళ్తూనే ఉంటారు.. అటువంటి వారికి చెడు జరుగుతుందని మన పూర్వీకుల అభిప్రాయం. అయితే కాళ్లు కడుక్కుని కాసేపు కూర్చోన్న తరువాత మంచినీళ్లు తాగేసి..మన ఇష్టదైవానికి దండ్నం పెట్టి తిరిగి బయలుదేరవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయమే.. దీన్ని మన వాళ్లు ఫోలో అవుతుంటారు.. అయితే ఇప్పటి ట్రెండ్ అవిపెద్దగా పట్టించుకోదని కొంత మంది ప్రజల అభిప్రాయం… సో.. శకునం చూసుకొని వెళ్లితే మంచిదని అంటున్నారు శాస్త్రం తెలిసిన పెద్దవాళ్లు.

శకునాల్లో మంచి శకునాలు, చెడు శకునాలు అనేవి రెండున్నాయి.

మంచి శకునం: మంచి శకునం వల్ల మీరు తలపెట్టిన పని ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. మీరు బయటికి వెళ్లేటప్పుడు.. ముత్తైదువులు, నీళ్ల బిందెలతో స్త్రీలు, ఆవు, ఏనుగు, గోమాత లేదా పిల్లాడిని ఒడిలో పెట్టుకున్న మహిళ, లేదా వృద్దుడి మృతదేహం కనిపిస్తే.. శుభం జరుగుతందని మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. దీని వల్ల మన, మీ ప్రయాణం మంచిగా సాగుతుందని అని అర్ధం.

పిల్లి: పిల్లి ఇంట్లో ప్రసవిస్తే అది కూడా సంపదకు సూచిక అని నమ్ముతారు.

కాకి: మన పెద్దలు, అల్పాహారం వేళ కాకి అరుపు వినపడితే..ఇంటికి చుట్టాలు వస్తారంట..ఇది మన వాళ్లు ఏప్పటి నుంచో పాటిస్తున్న ఆచారమే

పక్షి: మీ ఇంట్లో ఏ పక్షిఅయినా వెండి లేదా నగలను జారవిడిస్తే, అది లక్ష్మీ కటాక్షానికి శుభ సూచిక అని అంటుంటారు.

ఆవు: మనం బయల్దేరేటప్పుడు ఆవు మన ఇంటి గుమ్మం దగ్గర ఉంటే అది మన అదృష్టానికి శుభ సూచిక అని అంటారు.

కోకిల: కోకిల మన ఇంటి పరిసర ప్రాంతాల్లో శ్రావ్యమైన శబ్దం చేస్తే, ఆ ఇంటి యజమాని అదృష్టవంతుడు అవుతాడు.

గాడిద: ఇంటి ఎడమ వైపున గాడిద శబ్దం చేస్తే.. వ్యాపారంలో వృద్ధి జరుగుతుందని అంటారు

బల్లి: పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే మంచిదని అంటారు. అదే సమయంలో మహిళకు మాత్రమ ఎడమ భాగంపై పడితే శుభం కలుగుతుందని చెబుతూ ఉంటారు. బల్లి ముఖం మీద పడితే ఊహించని సంపద అని అంటారు.

చెడు శకునాలు:  మనం బయల్దేరేటప్పుడు ప్రయాణం సాగకుంటే… దాని వల్ల ఏదైనా అవంతారాలు వస్తే దాన్ని అపశకునంగా భావిస్తారు.

పాము: మనం బయల్దేరేటప్పుడు ఇంటి ప్రదాన గుమ్మం లోంచి పాము లోపలికి పాకుంటూ వేళితే దానిని చెడ్డ శకునంగా భావిస్తారు.

స్త్రీ: అర్ధరాత్రి వేళ స్త్రీ ఏడుపు వినిపిస్తే అది చెడ్డ శకునంగాను భావిస్తారు. మంచి శకునంలో స్త్రీ పుష్పవతి అయితే మంచిదని, పిల్లలు జన్మించేటప్పుడు కూడా మంచిటైంలో పుడితే వాడు మహర్జాతకుడు అవుతాడని అంటారు.

ఆవు: ఆవు తల ఎక్కువగా వణుకుతుంటే ఏదో కీడు జరుగుతుందని సంకేతంగా భావించొచ్చు.

పిల్లి: ఇంట్లో పిల్లి ఏడుపు వింతగా వినిపిస్తే అది దురదృష్టకరమని అని అంటారు. దీని ఆ ఇంటికి కీడు జరిగే ప్రమాదముందని అంటారు.

కాకి: మనం పెద్దలు ఎవరైనా చనిపోతే (కాలం చేస్తే) కాకులకు పిండ ప్రదానాలు చేస్తాం.. అయితే అవి పిండాలను కాకి తినకపోతే అపశకునంగా భావిస్తాం. దీంతో  భూమిపై ఆ పెద్దలకు ఇంకా ఏదో తీరనిది ఉందని పెద్దలు అంటుంటారు.

బల్లులు: మన గుమ్మం ముందు నిత్యం బల్లుల సంచరిస్తుంటే.. జీవితంలో మనకు అడ్డంకులు, వివాదాలను తెచ్చిపెడతాయని అని పెద్దలు చెబుతుంటారు. బల్లి ఎవరికైనా తల పైభాగన పడితే మరణ భయం ఉందని చెబుతుంటారు. బల్లి కలలో కనిపిస్తే మనం ప్రభుత్వ ఉద్యోగులమైతే మనకు ఏదో ఆటకం కలుగుతుందని నమ్ముతుంటారు. ఎవరికైనా చెయి మీద బల్లి బడితే ఆర్థిక నష్టం జరుగొచ్చని అంటారు.

ఇలా చెప్పుకుంటూ పోతే కోకో కొల్లుగా ఉంటాయి.. మరి నాకు తెలిసిన వాటిని మాత్రమే రాశాను సుమా..దీన్ని మీరు ఫాలో అవ్వొచ్చు.. కాక పోవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *