బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై కేసు నమోదు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై కేసు నమోదు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై కేసు నమోదు

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి “అయోసిన్ లెవల్ నెస్” అనే పేరుతో ఫిట్ నెస్ సెంటర్ ను నడిపిస్తోంది. అయితే దీనిలో భాగంగానే మరో సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ నుంచి కోట్లాది రూపాయలు తీసుకొని మోసం చేశారు. ఫిట్ నెస్ సెంటర్ కు డైరక్టర్ గా ఉంటున్న శిల్పా తల్లి సునంద, శిల్పాశెట్టిపై..ఉత్తరప్రదేశ్ లోని హజరత్ గంజ్, విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్లలో రెండు చోట్ల బాధితులు ఇచ్చిన పిటిష్లన్ల మేరకు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వీరిద్దరిని విచారించేందుకు ముందుగా నోటీసులు పంపామని.. కేసులో భాగంగా దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి సంజీవ్ సుమన్ అనే పోలీస్ అధికారి ముంబైలోని శిల్పా నివాసానికి వెళ్తారని.. అన్నికోణాల్లో కేసును పరిశీలించాకే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు. గతంలో అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త రాజు కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *