టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మరోక రజతం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మరోక రజతం

ఇండియా ఖాతాలో మరోక రజతం

రజతం సాధించిన రెజ్లర్ రవికుమార్ దహియా

గ్రూప్ -1, ఉద్యోగం, రూ.4కోట్ల నగదు, రాయితో ఇళ్లస్థలం

దేశవ్యాప్తంగా దహియాపై ప్రశంసల వర్షం  

మరోసారి ఇండియా పతాకం టోక్యో ఒలింపిక్స్‌లో రెపరెపలాడింది. దేశానికి రెండో రజత పతకాన్ని అందించిన రెజ్లర్ రవికుమార్ దహియాపై కానుకుల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు. అయితే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

హర్యానా సర్కార్ రెజ్లర్ దహియాకు గ్రూప్-1 కేటగిరిలో ఉద్యోగంతో పాటు.. రూ.4 కోట్ల రూపాయల క్యాష్ అవార్డ్ హర్యానా ప్రభుత్వం ఇవ్వనుంది. కుస్తీ వీరుడుకి హర్యానాలో ఎక్కడ కోరుకుంటే అక్కడ 50 శాతం రాయితీతో భూమి ఇస్తామని ప్రకటించింది. దహియా పుట్టిన ఊరు నహ్రీలో హర్యానా సర్కార్ ఇండోర్ స్టేడియం కట్టనున్నట్లు ప్రకటించింది.

రష్యాకు చెందిన ప్రపంచ విజేత అయిన జావుర్ ఉగుయేవ్ పై రెండుసార్లు చేతిలో దహియా రవికుమార్ ఓటమి పాలయ్యారు.. రష్యా ఆటగాడు ఉగుయేవ్ పై  57 కేజీల ఫైనల్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఈ గెలుపుతో ఇండియా లెజండరీ రెజ్లర్ సుశీల్ కుమార్ చరిత్ర పుటల్లో నిలిచారు. రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌లో సిల్వర్ పతకాన్ని భారత్ కు అందించిన రెండో ఆటగాడిగా దహియా నిలిచాడు.

తొలి రౌండ్‌లో 0-2తో వెనకబడిన దహియా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని స్కోర్లు సమం చేశాడు. అయితే, రౌండ్ ముగిసే సమయానికి రష్యా ఆటగాడు రెజ్లర్ ఉగుయేవ్ 4-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత అదే జోరు కొనసాగించి 7-2తో ఆధిక్యం సాధించాడు. మరోసారి పోరాడిన రవికుమార్ మరో 2 పాయింట్లు సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 4-7 తేడాతో ఓటమి పాలయ్యాడు.

ఇండియా ప్రతిష్టను ఒలింపిక్ లో తన ప్రతిభను చాటుకోవడం అభిమానులను చాలా గొప్పగా కీర్తిస్తున్నారు. దహియాపై ప్రధాని, రాష్ట్రపతితో సహా పలువురు మంత్రులు, సినీ హీరోలు ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *