ముంబై మేయర్ రేసులో సోనూ..స్పందించిన సోనూ

ముంబై మేయర్ రేసులో సోనూ..స్పందించిన సోనూ

ముంబై మేయర్ రేసులో సోనూ..స్పందించిన సోనూ

రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానుల ట్విట్ 

కరోనా, లాక్‌డౌన్‌ కష్ట కాలంలో సోషల్ మీడియా, మేసేజ్ ల రూపంలో ఆదుకోవాలంటూ అడిగిన అందరికీ లేదనకుండా సాయం చేసిన  రియల్‌ హీరో నటుడు సోనూసూద్‌. ఈ హీరో ఎన్నో సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ.. సోనూ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే 2022, బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బి.ఎం.సి) ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అయితే సోనూ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలొచ్చాయి. అయితే ఈసారి ముంబై మేయర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇచ్చేందుకు సెలబ్రిటీలని ఎంపిక చేసుకుందని.. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో సోనూతోపాటు, మోడల్, ఫిట్‌నెస్ పర్సనాలిటీ మిలింద్ సోమన్, హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్ నిలిచారని కథనాలొచ్చాయి. త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే ఈ విషయంపై స్పందించిన సోనూసూద్.. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. అయితే నేను సాధారణ వ్యక్తినేనని. నేను చాలా ఆనందంగా ఉన్నానని.. సోనూ స్పష్టత ఇచ్చారు. అయితే సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు, ఆయన అభిమానులు సోనూసూద్‌ని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయంపై సోనూ స్పష్టమైన క్లారిటీ సోషల్ మీడియా వేదికగా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *