ఢిల్లీ ‘దేశ్ కే మెంటర్స్’ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్

ఢిల్లీ ‘దేశ్ కే మెంటర్స్’ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్

ఢిల్లీ ‘దేశ్ కే మెంటర్స్’ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్  

దేశమంతా మెచ్చే హీరో.. లాక్ డౌన్, కరోనా కాలంలో ఎందరికో సాయం చేసి రియల్‌ హీరోగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు నటుడు సోనూసూద్.. కోవిడ్‌ వేళ ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. ఇప్పటికే ఆయనకు అనేక అవార్డులు, రివార్డులు దక్కాయి. అయితే ఢిల్లీ సర్కార్ కొత్తగా అమలు చేయనున్న ‘దేశ్ కే మెంటర్స్’ ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ ను నియమించినట్లు ఢిల్లీ సీఎం తెలిపారు. అయితే అరవింద్ కేజ్రీవాల్, సోనూసూద్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రోగ్రాం త్వరలోనే ప్రారంభమవుతుందని ఢిల్లీ సీఎం తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం తనకు ఈరోజు లభించనుందని, విద్యార్థులకు దిశా- నిర్దేశం చేయడం కంటే గొప్ప సేవ ఇంకేమీ ఉండదని సోనూసూద్ అన్నారు. సీఎం కేజ్రీవాల్   ఈ పథకం యొక్క ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తామని చెప్పారు.

లాక్‌ డౌన్ ప్రారంభమైనప్పుడు, అనేక మందితో తాను మమేకమయ్యానని, విద్య అనేది ప్రధాన అంశం అనే విషయంపై నేను గ్రహించానని సోనూ తెలిపారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఏమి చేయాలో అవగాహన లేనప్పుడు, కుటుంబంలో ఎవరూ చెప్పగలిగే పరిస్థితిలో లేనప్పుడు వారి పరిస్థితి ఏమిటి..? అలాంటప్పుడు ఎవరో ఒకరు విద్యార్థులకు మార్గదర్శకం కావాలి. ‘దేశ్ కే మెంటర్స్’ ప్రోగ్రాం ఇందుకు ఉద్దేశించినదే…అని సోనూసూద్ తెలిపారు. దీనిలో భాగంగా నేను ఈ పథకంలో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

మంచి పనులు చేయాలంటే పొలిటికల్ అవసరం లేదు..

పార్టీ రాజకీయాల్లోకి చేరుతారా..అని మీడియా అడిగిన ప్రశ్నలకు సోనూ చిరునవ్వుతో సమాధానమిచ్చారు.. నేను నిరంతరం మంచి పనులు చేయాలంటే..నేను రాజకీయాల్లోకి చేరాలా..? ఇదే విషయంపై నన్నుచాలామంది అడుగుతూనే ఉన్నారు. మంచి పనులు చేయడానికి రాజకీయాలే అవసరం లేదు. నాకు అలాంటి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. రాజకీయాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కూడా నేను మాట్లాడ లేదు..అని సోనూసూద్ చిరునవ్వుతో సమాధానమిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *