గ్రామీణ ప్రాంత ప్రజలకు సోనూ అండ

గ్రామీణ ప్రాంత ప్రజలకు సోనూ అండ
దేశ మంతా మెచ్చే హీరో సోనూసూద్, కరోనా టైంలో పేదల పాలిట దేవుడిగా నిలిచాడు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. స్ట్రీట్ వ్యాపారులకు బాసటగా నిలిచాడు. కరోనా టైంలో సోషల్ మీడియా వేదికగా ఒక మెస్సేజ్ పెడితే చాలు తన టీంను పంపి ప్రజల అవసరాలను తీర్చిన వ్యక్తి సోనూ. ప్రజల మన్నలను పొందిన సోనూ..తాజాగా ట్రావెల్ యూనిన్ నెట్ వర్క్ ను ప్రారంభించారు. దీని వల్ల టూరిజంలో పనిచేసే ట్రావెల్ ఏజెంట్లు, చిరువ్యాపార వేత్తలు, ఈ నెట్ వర్క్ సాయంతో గ్రామీణ వినియోగదారులకు సాయం చేయొచ్చునని సోనూ ఆలోచన.
అయితే దిలీప్ కుమార్ మోడీ కంపెనీ, స్పైస్ మనీ భాగస్వామంతో ఈ ట్రావెల్ యూనియన్ నెట్ వర్క్ ను స్థాపించారు. ఈ కంపెనీలో సోనూ సూద్ డైరెక్టర్ గా కొనసాగనున్నారు.
బీ2బీ (బిజెనెస్ టూ బిజినెస్) ట్రావెల్ టెక్ ఫ్లాట్ ఫాంగా నిలవనున్న ఈ ఫ్లాట్ ఫాం ఇండియాలోనే తొలి గ్రామీణ ఫ్లాట్ ఫామ్ గా ఉండబోతుంది. అయితే ఇదే క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు అందించేందుకు ట్రావెలింగ్ ఏజెన్సీలు అంతగా ఇష్టపడం లేదు. ఇదే విషయాన్ని ట్రావెల్ యూనియన్ సంఘాలు సోనూ దృష్టికి తీసుకెళ్లాయట. ఇదే తరుణంలో “ట్రావెల్ యూనియన్”ను ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రజల, ఇతర సదుపాయాలు కూడా తక్కువ ధరలోనే సోనూ ఏర్పాటు చేసిన ఫ్లాట్ ఫామ్ ఉపయోగపడుతుందని ఏజెంట్లు తెలిపారు. ఈ ఫ్లాట్ ఫాంతో ట్రావెల్ ఏజెంట్లు, పార్టనర్ ల భాగస్వామ్యంతో మరిత సేవలు అందించవచ్చును