పాజిటివ్ టాక్ తో.. SR కళ్యాణ మండపం

పాజిటివ్ టాక్ తో.. SR కళ్యాణ మండపం
కిరణ్ అబ్బవరం మరియు ప్రియాంక జవాల్కర్ కలిసి జంటగా నటించిన తాజా చిత్రం SR కళ్యాణ మండపం. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా.. ఆగస్ట్ 6 న థియేటర్ల లో విడుదల అయి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తొలి రెండు రోజుల్లో థియేటర్ల దగ్గర ప్రేక్షకులు ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకి “ షో“ ల ను పెంచినట్లు వార్తలొస్తున్నాయి. సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా రావడంతో సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అయితే శ్రీధర్ గాదె చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రమోద్ మరియు రాజులు నిర్మించారు. ఈ చిత్రంలో సాయికుమార్ కీలక పాత్ర పోషించారు.