శ్రావణ మంగళవారం.. పూజా విధానం

శ్రావణ మంగళవారం.. పూజా విధానం

శ్రావణ మంగళవారం.. పూజా విధానం

దేశంలోని హిందువు మహిళలకు ముఖ్యమైన పండుగలలో శ్రావణ మాసం. ఈ మాసంలో నూతన గృహ ప్రవేశాలు, పెళ్లిళ్లు, శుభమూర్తాలు, కొత్తగా నిర్మించే భవనాలకు ఈ మాసం ఎంతో ఆమోదయోగ్యమైనది.

శ్రావణ మంగళవారం పూజా విధానం:  కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళవారం నోములు నోచుకుటాంరు. పెళ్లైన ఏడాది నుంచే 5 సంవత్సరాల పాటు నోము నోచుకోవాలి. మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే తరువాత ఏడాదిలో పూజ చేయాల్సిందే. ఈ పూజ స్త్రీకి ఎంతో ముఖ్యమైంది. తమ మాంగళ్యాన్ని కాపాడమని కోరుతూ పూజ చేస్తూ ముత్తైదువులకు శనగలు, చలిమిడి, తమలపాకులు, వక్కపొడి వాయనం ఇస్తూ ఇచ్చికుంటినమ్మా వాయినం.. పుచ్చికుంటినమ్మా వాయనం అని ముత్తైదువుకు బొట్టు, కాటుక పెట్టి  కాళ్లకు దండం పెడతారు. 5 సంవ్సరాలలోపు బాలికలు, మరియు పెళ్ళికాని పిల్లల చేత కూడా కొన్ని ప్రాంతాలవారు ఈ వ్రతాన్ని చేయిస్తారు.

ఈ మంగళ గౌరీ వ్రతాన్ని తొలి సంవత్సరం పుట్టింటిలోను మిగతా నాలుగు సంవత్సరాలు అత్తింటిలోను ఆచరిస్తారు. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు.. తల్లి పక్కనే ఉండాలి. తోలి వాయినం కూడా తల్లికే ఇవ్వాలి.వ్రతం చేసుకొనే రోజు ఉపవాసం ఉండాలి. మొదటి వారం ఐదుగురు ముత్తయిదులను పిలిచి వాయనం ఇవ్వాలి.ప్రతి వారం ఒకే మంగళ గౌరీ విగ్రహానికి పూజ చేయాలి.

ఈ మంగళవారం నోము గురించి శ్రీకృష్ణుడు ద్రౌపతికి వివరించినట్టు మన పురాణాలు చెపుతున్నాయి. ఈ మాసం తొలుతగా మంగళవారంతో మొదలౌతుంది. పార్వతీ దేవీకి మరోక పేరు మంగళ గౌరీ గా పురాణాల్లో వల్లించబడ్డాయి.

తొలుతగా పూజారితో మండపారాధనలో శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి, దానిపై ఎండు కొబ్బరి చిప్పలో పుసుపుతో చేసిన గౌరీదేవిని అలకరించాలి, పుసుపు వినాయకుడిని కూడా తయారు చేసుకోవాలి. ఎందుకంటే దేవతల గణాతిపతి గణనాథుడు..కాబట్టి వినాయకుడికి పూజ చేయాలి. కలశం పెట్టాలనుకునే వారు కలశాన్ని పెట్టి, కలశ పూజ చేయాలి.

మ ముందుగా వినాయకుడికి నైవేద్యం, మంగళ గౌరి లేక ఫణి గౌరి అష్టోత్తరం చేయాలి. తరువాత అమ్మవారి ముందు 5 మడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యంపిడి, బెల్లంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి.

పూజ పూర్తైన తరువాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజలో పెట్టి ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా.. ఒకటి అమ్మవారికి, పూజచేసే వారు కట్టుకోవాలి. మిగిలిన మూడింటిని ముత్తయిదువులకు  తాంబూలంతో పాటు ఇవ్వాలి. స్తోమతను బట్టి జాకెట్ ముక్క కూడా ఇవ్వొచ్చు.

వ్రతం చేసుకున్న మరునాడు కూడా అమ్మవారికి హారతిచ్చి, నైవేద్యం పెట్టి … యధాస్థానం ప్రవేశయామీ, పూజార్ధం పునరాగమ నాయచం: అని అమ్మవారికి ఈ విధంగా మంత్రోచ్ఛారణ చెప్తుతూ ఉద్వాసన చెప్పాలి.

అంటే అమ్మా నీవు మరలా నీ స్వస్థానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని మమ్మల్ని అనుగ్రహించని అని అర్ధం. దీంతో ఒక మంగళవార వ్రతం సంపూర్ణం అవుతుంది. సాధారణంగా పసుపు కుంకుమల సౌభాగ్యం, సంతానం కోసం, అన్యోన్య దాంపత్యం కోసం ఈ మంగళ గౌరీ వ్రతం చేస్తారు.

అందుకే ఈ పండుగ ఆడవాళ్లకు ఓ ప్రత్యేకమైన పండుగగా చెబుతుంటారు. దీని కోసం ఆలయాలతో పాటుగా.. వ్రతాలు ఆచరించే వారందరి ఇళ్లలో సందడిగా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *