శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఏపీలోని ఏజెన్సీ వాసులకు స్వామి దర్శనం కోసం ఉచిత బస్సులు

బ్రహ్మోత్సవాలు చూసేందుకు రోజుకు వెయ్యి మందికి దర్శనం

ఉచిత బస్సులు ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం

ఏపీ: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఆలోచన చేసింది. తిరుమలేశుని ప్రాంతంలో గత కొంత కాలంగా మత మార్పిడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో దేవాదాయ శాఖతో కలిసి సమరసత సేవా ఫౌండేషన్ తో కలిసి టీటీడీ ఈ ఆలోచన చేసింది. అయితే తొలి విడతగా రూ.25కోట్లతో 502 ఆలయాలను నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా భక్తుల సౌకార్యర్థం  రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రోజుకు వెయ్యి మంది చొప్పున బలహీన వర్గాల భక్తులకు అక్టోబర్ 7 నుంచి 14 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం చేయించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుమలేశుని దర్శనంతో పాటుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం కూడా చేయించనున్నారు. అయితే ఈ ఆలయాల పరిధిలోని భక్తులకు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు శ్రీవారి దర్శనం చేయించనున్నారు. ఒక్కో జిల్లాలకు 10 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండటంతో 20 బస్సులను ఏర్పాటు చేసింది టీటీడీ.  శ్రీవారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక దాతల సహకారంతో భోజన వసతి ఏర్పాట్లు చేసింది టీటీడీ. గురువారం ద్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. అదేరోజు రాత్రి శ్రీవారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఈనెల  7 నుంచి ప్రారంభమై 15 వరకు వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం(6-10-2021)న నాడు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల పుట్టమన్ను సేకరించి నవ ధాన్యాలు విత్తి వేడుకలకు అంకురార్పరణ చేయనున్నారు అర్చకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *