ఆరు పేపర్లతో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్
ఆరు పేపర్లతో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్
తెలంగాణలో టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా. అయితే ఈసారి టెన్త్ ఎగ్జామ్ పై విద్యార్థులు, టీచర్లలో అయోమయం ఏర్పడిన సందర్భంలో.. బోర్డ్ ఎగ్జామ్స్ లో 6 పేపర్లే ఉంటాయని టెన్త్ తెలిపింది. దీనిపై సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు.
అయితే గత రెండేళ్లుగా కరోనాతో పదోతరగతి పరీక్షలు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఈసారి పరీక్షలపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఈసారి 11 పరీక్షలుంటాయా..6 పరీక్షలకే కుదిస్తుందా అనే అయోమయంలో.. టీచర్లు, పేరేంట్స్, విద్యార్థుల్లో ఉంది. విద్యార్థులకు క్లాసులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పరీక్షలపై క్లారిటీ ఇవ్వకపోవటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.ప్రభుత్వం క్లారిటీపై విద్యార్థులకు కొంత ఊరట కలిగింది. హిందీతోపాటు..ఉర్దూను ద్వితీయ భాషగా ఉత్తర్వుల్లో పేర్కొంది.