టీ20 వరల్డ్ కప్… భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

టీ20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
2021, టీ20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, అయితే అక్టోబర్ 17న యూఏఈ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. ఈ వరల్డ్ కప్ ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొత్త బాధ్యతలను అధిరోహించనున్నారు.
ఇండియా టీ20 వరల్డ్ కప్ జట్టు వీళ్లే: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంత్రకన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అయితే ఈ జట్టులో ఎడమ చేతి వాటం ఉన్న శిఖర్ ధవాన్ కు చోటు దక్కలేదు. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాను పేసర్లుగా ఎంపిక చేసింది. అయితే అక్టోబరు 10 వరకూ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం లేకపోలేదు.