ఆగస్టు 31 లోగా ఖాళీ చేయాలని అమెరికాకు వార్నింగ్

ఆగస్టు 31 లోగా ఖాళీ చేయాలని అమెరికాకు వార్నింగ్

ఆగస్టు 31 లోగా ఖాళీ చేయాలని అమెరికాకు వార్నింగ్

అమెరికాకు తాలిబన్లు హెచ్చరిక

ఆగస్టు 31లోగా మీ సేనలను ఖాళీ చేయాలంటూ వార్నింగ్

ఆఫ్గానిస్తాన్ ను తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు అగ్రరాజ్యమైన అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆగస్టు 31లోగా అమెరికా సైనిక బలగాలను ఆఫ్గానిస్తాన్ నుంచి  ఉపసంహరించుకోవాలని లేదంటే మీపై తీవ్ర పరిణామాలుంటాయంటూ తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ పొరుగు దేశాల ప్రజల తరలింపులో ప్రక్రియలో భాగంగా మేము మాసైనికులను అక్కడ ఉంచామని తెలిపారు. ఓ వైపు ఆగస్టు 31 లోపు కాబూల్ విమానాశ్రయం నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్లు అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చారు. మేము ఇచ్చిన గడువులోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ తేల్చి చెప్పారు.

పొరుగు దేశాలకూ తాలిబన్ల వార్నింగ్‌
అయితే అగ్రరాజ్యమైన అమెరికాతో పాటుగా మిత్ర దేశాలకు కూడా ఇదే హెచ్చరిక జారీ అమలవుతుందని.. వారంలోగా ఆఫ్గానిస్తాన్ ఉండే అన్ని దేశాల సైనికులు దేశం విడిచి వెళకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే ఆఫ్గానిస్తాన్ లో అన్ని దేశాల సైనికులు వెళ్లాకే మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు ఆఫ్గానిస్తాన్ ను విడిచివెళ్లేందుకు వేలాదిగా ప్రజలు కాబూల్‌ విమానాశ్రయానికి తరలివస్తున్న నేపథ్యంలో తాలిబన్ల అరాచకం, ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రికత్త పరిస్థితులు మనకు    తెలిసిందే. కానీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ అక్కడి ప్రజలకు.. ఆఫ్గానిస్తాన్ ను వదిలి వెళ్లొద్దంటూ తాలిబన్లు వార్నింగ్ ఇస్తూ.. అక్కడి ప్రజల ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *