ఇండియాకు ధన్యవాదాలు చెప్పిన తాలిబన్లు

ఇండియాకు ధన్యవాదాలు చెప్పిన తాలిబన్లు

ఇండియాకు ధన్యవాదాలు చెప్పిన తాలిబన్లు

కాబూల్:  భారత్ ను ప్రశంసించిన తాలిబన్లు.. అఫ్గానిస్థాన్‌లో భారత్ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు తమను ఎంతో ఆకర్షించాయని.. తాలిబన్లు ఇండియాకు సర్కార్ కు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇండియా.. అఫ్గాన్ నిస్తాన్ లో ప్రజల కోసం డ్యాములు, రోడ్లు, నీటి సదుపాయంతో ఇతర మౌలికవసతులు ఏర్పాటు చేశారని.. ఇండియా సర్కార్ కు ధన్యవాదాలు’’ అని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహెయిల్ షాహీన్ తాజాగా వ్యాఖ్యానించారు. తాలిబన్ ప్రతినిధి సుహెయిల్ షాహీన్  ను  ఓ జాతీయ ఛానల్‌ ఇంటర్వ్యూ చేయగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా సహా మరే ఇతర దేశాలకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్‌ లో ఉద్రిక్త పరిస్థితులు తలేత్తాలా చేయకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే.. అఫ్గానిస్థాన్‌లో ఇండియా ఎటువంటి సైనికపరమైన చర్యలు చేపట్టకూడదని సుహెయిల్ తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: