తాలిబన్లపై నిషేధం విధించిన సోషల్ మీడియా సంస్థలు

తాలిబన్లపై నిషేధం విధించిన సోషల్ మీడియా సంస్థలు

తాలిబన్లపై నిషేధం విధించిన సోషల్ మీడియా సంస్థలు

అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో సోషల్ మీడియాలో వార్తలు హల్ ఛల్ చేస్తున్నాయి. వారి అరాచకాలకు హద్దు లేకుండా మితిమీరిపోతున్నాయి.. అందుకే వారు సోషల్ మీడియాను వేదికకగా వాడుకుంటున్నారు. అందుకే వారి అరాచకాలను అరికట్టేందుకు.. ఇప్పటికే సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాలిబన్లపై తాజాగా యూట్యూబ్‌, వాట్సాప్‌ కూడా ఓ నిర్ణయం తీసుకున్నాయి. వారి వార్తలను ప్రసారం చేయకుండా ఉండేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాలిబన్లకు చెందిన వీడియోలను యూట్యూబ్‌లో కన్పించే ప్రసక్తే లేదని ఒకవేళ అట్టి వీడియోలుంటే ప్రపంచంలో ప్రజలు చూసే వీలులేకుండా వెంటనే హోల్డ్ చేస్తామని తెలిపింది.

తాలిబన్లకు చెందిన వీడియోలను స్ట్రీమ్‌ చేయకుండా చేసే పాలసీ తాము ఎప్పటినుంచో అనుసరిస్తున్నామని యూట్యూబ్‌ తెలిపింది. వాట్సాప్‌ కూడా అఫ్ఘన్లు తాలిబన్లను కాంటాక్ట్‌ అయ్యే ఫిర్యాదుల హెల్ప్‌లైన్‌ను మూసివేసింది. అయితే దీనిపై మాట్లాడటానికి వాట్సాప్‌ ప్రతినిధి నిరాకరించారు. యూఎస్ చట్ట ప్రకారం తాలిబన్ల హెల్ప్ లైన్ ను నిలిపేసిన యూట్యూప్ సంస్థ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *