తాలిబన్లు ఆక్రమణతో పలు దేశాలపై ప్రభావం

తాలిబన్లు ఆక్రమణతో పలు దేశాలపై ప్రభావం

తాలిబన్లు ఆక్రమణతో పలు దేశాలపై ప్రభావం

అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్న తర్వాత వాళ్ల అరచకాలకు హద్దు అదుపు లేదు.. ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకునేందుకు తాలిబిన్ల నేతలు బిజీగా ఉన్నారు. అయితే మాజీ ప్రభుత్వ అధికారులు, సైనిక అధికారులను వెతికి పట్టుకోవడానికి కాబూల్ అంతా గాలిస్తున్నారు. అయితే అఫ్గానిస్తాన్ ప్రజలు దేశం విడిచి పారిపోవాలని యత్నిస్తే  పెద్దలు, మహిళలు, పిల్లల్ని అని కూడా చూడకుండా వారిపై ఆయుధాలు పెట్టి బెదిరిస్తున్నారు. అయితే తాజాగా ఓ స్త్రీ తిరగబడితే వారి వస్త్రాలను విప్పి వీధుల్లో పడేస్తున్నారు తాలిబన్లు. తాజాగా మేము శాంతియుత పాలన అందిస్తామని చెప్పారు తాలిబన్లు. అయితే వారు చెప్పే మాటలకు పొంతన లేకుండా పోయిందని లేకుండా పోయింది. అక్కడి స్త్రీలకు భద్రత కల్పిస్తామని చెప్పారు. తాలిబన్ల అరచకాలు భరించలేక అక్కడి ప్రజలు పారిపోతున్నారు. ఎయిర్ పోర్టులో జరిగిన పరిస్థితుల బట్టి చూస్తే అక్కడి పరిస్థితులు ఎంత దీనంగా ఉన్నాయో తెలుస్తుంది.

అయితే ప్రస్తుత పరిస్థితిలో ఆఫ్గానిస్తాన్ భారత్ మధ్య అనేక వ్యాపార లావాదేవీలు ఉండేవి. ఇప్పుడు తాలిబన్ల ఆక్రమణతో మనకు వాణిజ్య ఒప్పందాలు అనేవి ఆగిపోయాయి. అయితే కొన్ని ఉత్పత్తులు పాకిస్తాన్ మీదుగా రోడ్డు మార్గంలో వస్తుంటాయి. తాలిబన్ల ఆక్రమణతో ఇండియాలోని వాణిజ్య వర్తకులకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే వాణిజ్య కార్యకలాపాలు సాగించేందుకు ముందుగానే కొంతమంది భారత్ లోని వర్తకులు వ్యాపారం చేసేందుకు చెల్లింపులు చెల్లించారు. అయితే తాలిబన్ల ఆక్రమణ ముందే తెలిసి ఉంటుందని.. అయితే ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వం మాకు సమాచారమివ్వలేదని ఆందోళన చేస్తున్న ఇండియాలోని వర్తకులు. తాలిబన్లోని వ్యాపారస్తులతో వర్తక వాణిజ్యాలు ఆగిపోయాయని తెలిపారు. తాలిబన్ నుంచి అక్కడి సరుకు ట్రక్కుల్లో వస్తుందని ఇంకా ఎదురు చూస్తేనే ఉన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (FIEO) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ఇండియాలోని వ్యాపారులు. ముఖ్యంగా భారత్ తో వాణిజ్య సంబంధాలు తెంచుకునేందుకు తాలిబన్లు చూస్తున్నారు.

అయితే భారత్-ఆఫ్గానిస్తాన్ మధ్య వాణిజ్య ఒప్పందాల విలువ 1.4 బిలయన్ డాలర్లకు పైగా దిగుమతులు విలువ 826 మిలయన్లు ఉండేవని..ఇండియాలో ఎక్కువగా డ్రై ఫ్రూడ్స్ వర్తకం జరిగేదని తెలుస్తోంది. వాల్ నట్, ఆల్మండ్, అంజీరా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, ఎండు ఆఫ్రికాట్ బిజినెస్ కోట్లలో నడిచేదని తెలుస్తోంది. వీటితో పాటుగా ఆయుర్వేద మూలికలు కూడా దిగుమతి చేసుకునే వారని తెలుస్తోంది.

ఆఫ్గానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించడంతో మనకు వచ్చే దిగుమతులపై ప్రభావం బాగా చూపుతోంది. మనం తాగే టీ, కాఫీ, మిరియాలు, వాడుకునే చెప్పులు, తోలు బొమ్మలు, పెట్రోల్, డీజిల్ పెరుగుతుందని..తాలిబన్లు అరచకాలతో అక్కడి బంగారానికి రెక్కలొస్తాయిని చెప్పొచ్చనని.. ఇతరత్రా ఉత్పత్తులుపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *