పెట్రోల్‌ ధరను మించిన టమాటా.. కిలో రూ.140

పెట్రోల్‌ ధరను మించిన టమాటా.. కిలో రూ.140

దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు చోట్ల ధ్వంసమైన కూరగాయల పంటలు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొనాలన్నా.. కేజీ 60 రూపాయల పైనే  పలుకుతోంది. ఆకాశానంటుతున్న టమాటా ధర..అయితే దేశ వ్యాప్తంగా పెట్రోల్‌ ఎంత స్పీడ్‌గా పెరుగుతుంటే.. దానికన్నా టమాటా ధర మరింతగా దూసుకెళ్తొంది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో టమాటా ధర సెంచురీ దాటేసింది. హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పైగా పలుకుతోంది. మరో ఏపీలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించడంతో టమాటా పంట భారీగా దెబ్బతింది. దీంతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140పైగా పలుకుతోంది.

దేశంలోనే అత్యధికంగా టమాటాలు పండే  ప్రాంతం ఆంధ్రప్రదేశ్. అక్కడ లక్షా 43 వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమాటా సాగవుతుంది. అందులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంటలు భారీగా డ్యామేజీ కావడం, ఉన్న పంట రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో టమాటాతొ పాటుగా మిగతా కూరగాయల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

అయితే వర్షాలు తగ్గితేనే కూరగాయల పరిస్థితి మరో నెల రోజుల పాటు అధిక ధరలతో  కూరగాయలు కొనాల్సిందేనని అంటున్నారు రైతులు. మరో ప్రక్క టమాటా రేటు  మాత్రం తగ్గడం కష్టమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి  ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు వస్తున్న టమాటా.. మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌‌ల నుంచి మాత్రమే వస్తున్నట్లు వ్యాపారులు, రైతులు  చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *