ఆస్కార్‌ బరిలో నిలిచి తమిళ చిత్రం ‘కూజాంగల్’

ఆస్కార్‌ బరిలో నిలిచి తమిళ చిత్రం ‘కూజాంగల్’

తమిళ  సినిమా ‘కూజాంగల్’ అస్కార్ అవార్డుకు ఎంపికైంది. 2022లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు తరఫు నుంచి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆస్కార్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్‌ పర్శన్‌ షాజీ ఎన్‌ కరుణ్‌ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు  ఎఫ్‌ఎఫ్‌ఐ జనరల్‌ క్రెటరీ సుప్రాన్‌ సెన్‌ తెలిపారు.

రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన తమిళ చిత్రం ‘కూజాంగల్’. ఈ చిత్రంలో హీరోయిన్ నయనతార, డైరెక్టర్‌ విఘ్నేష్ శివన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అస్కార్ అవార్డుకు ఎంపికయ్యింది.  ఇప్పటికే ఈ సినిమా టైగర్ అవార్డు ఫిల్మ్​ ఫెస్టివల్​లో సత్తాచాటింది.

కుటుంబంలో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా కూళంగల్‌ తెరకెక్కింది. ఇద్దరి తండ్రీకొడుకుల స్టోరీ. తాగుబోతు తండ్రి వేధింపులు భరించలేక తల్లి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆమెను తిరిగి వెనక్కి ఎలా తీసుకొచ్చారనేదే ఈ సినిమా సారాంశం. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్‌ నామినేషన్‌కు వెళ్లే మొత్తం 14 సినిమాలను వీక్షించి అందులో ‘కూజాంగల్’ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. మార్చి 2022న లాస్‌ ఏంజెల్స్‌లో జరిగే 94వ ఆస్కార్‌ పోటీలకు భారత్ నుంచి ఈ సినిమా బరిలో నిలవనుంది.

అయితే ‘కూళంగల్‌’ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచిందన్న విషయం తెలియగానే విఘ్నేశ్‌ శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై విఘ్నేశ్‌ శివన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ “అండ్‌ ది ఆస్కార్స్‌ గోస్‌ టూ”.. అనే పదం వినేందుకు చాలా ఆనందంగా ఉందని, ఆస్కార్‌ గెలుచుకునేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉ‍న్నామని అన్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *