దేశీయ మార్కెట్ లోకి మరో టాటా ఎలక్ట్రికల్ కారు  

దేశీయ మార్కెట్ లోకి మరో టాటా ఎలక్ట్రికల్ కారు  

దేశీయ మార్కెట్ లోకి మరో టాటా ఎలక్ట్రికల్ టిగోవర్ కారు  

5.7 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగం

రూ.21 వేలు చెల్లిస్తే కారు మీ స్వంతం

ఆగస్టు 31 నుంచి కార్ల డెలీవరీలు

వాహన తయారీ సంస్థల్లో టాటా మోటార్స్ ఓ కంపెనీ..అయితే ఈ టాటా మోటార్స్.. కార్లు వాడే ప్రియుల కోసం కొత్త ప్రయోగాలు చేస్తోంది. అయితే ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మరో ఎలక్ట్రిక్​ కారును లాంచ్​ చేసింది. ఇప్పటికే నెక్సాన్​ ఈవీతో ఎలక్ట్రిక్​ మార్కెట్​లో దూసుకుపోతున్న టాటా మోటార్స్​.. ఈ కంపెనీ టిగోర్‌ ఎలక్ట్‌ వెహికిల్‌ను(ఈవీ) ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

టిగోర్‌ ఎలక్ట్‌ వెహికిల్‌ ప్యూచర్స్ ఇలా ఉన్నాయి:

ఈ కారు గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని 5.7 సెకన్లలో చేరుకుంటుందని.. 55 కిలో వాట్ పవర్, 170 ఎన్ ఎం టార్క్ తో 26 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందు పర్చామని, 1,60,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ, మోటార్ వారంటీ ఉంటుందని ప్రొడక్ట్ లైన్​ వైస్​ ప్రెసిడెంట్​ ఆనంద్​ కులకర్ణి తెలిపారు.

అయితే ఈ కారు ఈవీ జిప్‌ట్రాన్‌ టేక్నాలజీ హై ఓల్టేజీతో తయారైందని తెలిపారు. అయితే ఈ కారును బుక్ చేసుకునేందు డీలర్ల వద్ద రూ.21వేలు చెల్లించి.. కొత్త టిగోర్‌ను స్వంతం చేసుకోవచ్చునని టాటా మోటార్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ కారు అమ్మకాలు ఆగస్ట్‌ 31 నుంచి డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 30కు పైగా కనెక్టెడ్‌ ఫీచర్లకు ఇది సపోర్ట్‌ చేస్తుంది. ఎలక్టిక్‌ వాహన విభాగంలో దేశం నెక్సన్‌ ఈవీక్‌ 70 శాతం మార్కెట్‌ వాటా ఉంది. అయితే ఈ కారులో వాహనదారులు మెరుగైన ప్రయాణాన్ని ఆశ్వాదించొచ్చని వైస్ ప్రెసిడెంట్ ఓ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: