ఈ వాహనాన్ని మడత పెట్టి అక్కడ పెట్టుకోవచ్చు!
ఎలక్ట్రిక్ వాహన రంగం తయారీలో జపాన్ ముందంజలో ఉంటుంది. జపాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ సంస్థ ‘ఇకోమా’ సంస్థకు చెందిన డిజైనర్లు.. మరో వాహన తయారీ సంస్థ ‘టాటామెల్’తో కలసి దీనికి ఓ ఎలక్ట్రికల్ వాహనాన్ని తయారు చేశారు. ఈ వాహనం ఖరీదు ఎంత ఉంటుందో చెప్పలేదు. అయితే గమ్మత్తు ఏమిటంటే ఈ వాహనాన్ని మడత పెట్టెకోవచ్చు.
ఈ బైకు ప్రత్యేకతలు: ఒక మనిషి సునాయాసంగా ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. తయారు చేసిన ఈ–బైక్, గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీనిలో లిథియం ఐరన్ ఫ్యాస్ఫేట్ బ్యాటరీ ద్వారా పవర్ ఉత్పత్తి అయి ముందుకు సాగుతుంది. దీనిలో అసలు ప్రత్యేకతేమిటంటే మన ఆఫీసులో మన టేబుల్ కింద మడత పెట్టుకోవచ్చు.మడతపెట్టే వాహనాలు కొన్ని ఇప్పటికే తయారయ్యాయి గాని, అవేవీ ఇంత చక్కగా ఆఫీసు టేబుల్ కింద పట్టేంత సౌలభ్యం కలిగినవి కావు. కంపెనీ యాజమాన్యం కస్టమర్ల అభిరుచులతో పాటుగా ఈ వాహనాని వివిధ రంగులలో తయారుచేస్తామని చెబుతోంది. వాహన సైడ్ ప్యానెల్లను మీరు ఇష్టపడే రంగులతో మరియు మెటీరియల్‌లతో భర్తీ చేయవచ్చు.