TCSలో మహిళల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్

TCSలో మహిళల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్
దేశ వ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) మహిళా సాప్ట్ వేర్ ఎంప్లాయిస్ కోసం ప్రత్యేక రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఇండియా వ్యాప్తంగా ఉన్న నిపుణులైన మహిళలను ఎంపిక చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ మహిళలకు గొప్ప అవకాశంగా భావించొచ్చని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంతో మంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. దీని పేరును రీ బిగిన్(Rebegin)గా సదరు కంపెనీ నిర్ణయించారు. ఈ సందర్భంగా TCS స్పందిస్తూ రీబిగిన్ తో సత్తా ఉన్న మహిళలకు సదవాశం కల్పిస్తున్నామని అన్నారు. మా కంపెనీ ఎల్లవేళా ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. ITలో ప్రాథమిక అవగాహన కలిగిన ప్రొఫెషన్ మహిళలను ఎంపిక చేసి వారిని తీర్చి దిద్ది ప్రత్యేక టీమ్ లుగా అభివృద్ధి చేస్తామని తెలిపింది.
చదువు:
TCS కంపెనీకి దరఖాస్తు చేసుకోవాలంటే మినిమ్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. ఈ కంపెనీలోజాయిన్ అవ్వాలంటే 2 లేదా 5 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. TCSకి ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైన పనిచేయాల్సి వస్తుంది.
TCSకు అప్లై చేసుకునేవారు ఈ అర్హతలు కలిగి ఉండాలి
ఈ కంపెనీకి అప్లై చేసుకునే వారు అభ్యర్థులు Structured Query Language (SQL)DBA, ఆటోమేషన్ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కన్సల్టెంట్, ఆంగ్యులర్ JS, ఒరాకిల్ DBA, సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, Java developer, Dot Net developer, android developer, IOS డెవలపర్, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మిన్, మెయిన్‌ఫ్రేమ్ అడ్మిన్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, Java developer, డాట్నెట్ డెవలపర్ తో PL SQL లో అనుభవం ఉండాలి.
ఇంటర్వ్యూ ఎలా:
ఒకే రౌండ్ ద్వారానే అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు.
అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా https://www.tcs.comలో దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేసుకునే వారు పైన చెప్పిన స్టడీ, ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు వివరాలను సైట్ లో పొందుపర్చాలి.
TCS కంపెనీలో సెలక్టైన అభ్యర్థులకు తమ (email.id) ఈ మెయిల్ ఐడీకి ఇంటర్వ్యూ వివరాలు కంపెనీ పంపించడం జరగుతుంది.