తెలంగాణలో మూడు జిల్లాలో ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

తెలంగాణలో మూడు జిల్లాలో ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

తెలంగాణలో మూడు జిల్లాలో ఆ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

(Telangana) తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి అధికారులు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. రాష్ట్రంలోని మెదక్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుల్లో అంగన్ వాడీ టీచర్, స్టాఫ్, ఆయా తదితర విభాగాల్లో పోస్టులు(Posts)ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని టెన్త్ పాసైన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని నోటిఫికేషన్లో తెలిపారు. అయితే అభ్యర్థులు ఆన్ లైన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. స్థానికంగా నివాసం ఉండే మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం నోటిఫికేషన్లలో స్పష్టంగా తెలియచేశారు. జిల్లాల వారీగా దరఖాస్తులకు ఆహ్వానం కోరుతోంది ఈ శాఖ. ఆయా జిల్లాల్లో వేర్వేరుగా ఆఖరి తేదీలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా పోస్టులు: ఆఖరు సెప్టెంబర్ 9

ఖమ్మం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోస్టుల వివరాలను తెలిపారు. ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్ట్ ఖమ్మం పరిధిలో 12 అంగన్ వాడీ టీచర్, అంగన్ వాడీ ఆయాల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 9లోగా పోస్టులకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.

ఖమ్మం జిల్లా ఐసీడీఎస్ (ICDS) కామేపల్లి ప్రాజెక్టు పరిధిలో 09 అంగన్ వాడీ టీచరు, అంగన్ వాడీ ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి తెలిపారు. ఈ పోస్టలకు కూడా  సెప్టెంబర్ 9లోగా అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో ఐసీడీఎస్(ICDS) ప్రాజెక్ట్ 9 అంగన్ వాడీ ఆయా  పోస్టులు ఖాళీలు ఉన్నాయి తెలిపారు. సెప్టెబర్ 9 లోగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లా పరిధిలో 19 ఆయా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు సైతం సెప్టెంబర్ 9లోగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

మెదక్ జిల్లాలో ఖాళీలు.. ఆఖరి తేది సెప్టెంబర్- 8
మెదక్ జిల్లా వ్యాప్తంగా (ICDS) ప్రాజెక్టుల పరిధిలో అంగన్ వాడీ, ఆయా, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అల్లాదుర్గ ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్ట్ పరిధిలో 65 అంగన్ వాడీ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేశారు. రామాయంపేట పరిధిలోనూ 35 ఆయా పోస్టుల భర్తీ చేస్తామని తెలిపారు, ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్ట్ నర్సాపూర్ లోనూ 43 అంగన్ వాడీ స్టాఫ్ ఖాళీల భర్తీ చేస్తామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీ  సెప్టెంబర్ 6లోగా ఆన్లైన్లో మాత్రమే అభ్యర్థులు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేశారు అధికారులు.

సిద్దిపేట జిల్లాలో వ్యాప్తంగా పోస్టుల భర్తీ: ఆఖరు తేదీ: సెప్టెంబర్- 8 

సిద్దిపేట జిల్లాలోనూ పలు ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల పరిధిలో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐసీడీఎస్(ICDS) ప్రాజెక్ట్ దుబ్బాక పరిధిలో 12, ఐసీడీఎస్ (ICDS) చేర్యాల్ ప్రాజెక్ట్ పరిధిలో 16 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రాజెక్ట్ పరిధిలో 19, హుస్నాబాద్రిధిలో 13 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. గజ్వేల్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్ వాడీ సహాయకురాలు(హెల్పర్) 35 హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 8లోగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *