TS లో పనిచేస్తున్న ఉద్యోగులు… APకి శాశ్వత బదిలీకి ప్రభుత్వం అనుమతి

TS లో పనిచేస్తున్న ఉద్యోగులు… APకి శాశ్వత బదిలీకి ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు… ఆంధ్రప్రదేశ్ శాశ్వత బదిలీకి ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రదేశ్ కు చెందిన ఉద్యోగులు, అధికారులు ఏపీకి శాశ్వత బదిలీపై వెళ్లేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ  ఉద్యోగులను బదిలీపై వెళ్లేందుకు చాలా మంది ఉద్యోగులు సముఖత చూపడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్న తెలంగాణ ప్రభుత్వం. కాగా, ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

అయితే విధుల పట్ల నిర్లక్ల్యం వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంప్లాయిస్, అధికారులు మాత్రం.. క్షమశిక్షణ చర్యలు, విజిలెన్స్‌ కేసులతో పాటుగా మరెన్నో కేసులు పెండింగులో ఉన్న ఎంప్లాయిస్ కి  మాత్రం ఈ అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత బదిలీల కోసం పాటించాల్సిన నిబంధనలపై ఆదేశాలు జారీ చేశామని… సెక్రటేరియట్ తో పాటుగా మరియు అన్ని శాఖల కార్యదర్శులు దీనిని అమలు చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. ఉద్యోగులు బదిలీ కోసం అక్టోబర్ 15 లోగా ధరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

తాజాగా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ ఉద్యోగుల బదిలీలపై సీఎస్, ఇతర అధికారులు, మంత్రలతో చర్చ జరుగగా, వారిని శాశ్వత బదిలీకి ఆమోదానికి ముద్రవేశారు. అందుకనుగుణంగా తాజాగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఉద్యోగులు, అధికారులు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లేందుకు తమను అనుమతించాలని తెలంగాణ సర్కార్ ని అభ్యర్థించగా.. మొదట్లో డిప్యూటేషన్‌, అంతరరాష్ట్ర బదిలీల కింద కొందరిని ఏపీ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే తెలంగాణలో పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచారు. గతంలో తెలంగాణలో పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లుండగా..ఇదే క్రమంలో తెలంగాణలో పనిచేసే ఏపీ ఉద్యోగులు..ఆంధ్రప్రదేశ్ కు బదిలీ కోరుతూ ఉద్యోగుల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో ఎంతమంది ఉద్యోగులు ఏపీకి శాశ్వత బదిలీలకు ఎంతమంది ఉద్యోగులు ముందుకొస్తారో పరిశీలించి, వారిని అనుమతించే అవకాశమున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

బదిలీలలో భాగంగా అధికారులు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. సంబంధిత అధికారుల సిఫారసుతో ఉద్యోగి పనిచేసే శాఖ కార్యదర్శి ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగిపై  ఎటువంటి కేసులు, ఆరోపణలు లేవని పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుంచి అనుమతి లభించగానే తెలంగాణలో చేసే ఉద్యోగులను వెంటనే సంబంధిత అధికారులు ఉద్యోగులను రిలీవ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని సర్వీసు రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. రిలీవ్‌ అనంతరం శాశ్వతంగా బదిలీ అయినట్లే పరిగణిస్తారు. మళ్లీ వెనక్కి తెలంగాణలో పనిచేసేందుకు  అవకాశం ఉండదని తెలిపారు.అయితే ఈ ప్ర్రక్రియను వెంటనే కొనసాగించాలని..ఉద్యోగులు ఎంతమంది ముందుకొస్తారో తెలుసుకొని వెంటనే వారిని రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: