తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
కరోనా తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లు, కాలేజీలు తెరవబడ్డాయి. అయితే ఇంటర్ పరీక్షల దృష్ట్యా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాలను తెరించేందుకు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విద్యాశాఖ. గతంలో కొవిడ్ ఎక్కువగా ఉన్నందున కొన్ని ఆంక్షల కారణంగా గురుకులాలను తెరవలేదు. దీంతో గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించి గురుకులాలను తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను తెరుచుకోవచ్చునని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురుకులాలలో ప్రత్యక్ష, ఆన్లైన్ బోధనా చేపట్టాలని స్పష్టం చేసింది. విద్యా సంస్థల్లో కోవిడ్ నియంత్రణల మధ్య అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రత్యక్ష బోధన చేపడతున్నామని ఏజీ ప్రసాద్ కోర్టుకు వివరించారు