తెలంగాణ హైకోర్టుకు దసరా సెలవులు
తెలంగాణ హైకోర్టుకు దసరా సెలవులు
తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా తెలంగాణ హైకోర్టుకు అక్టోబర్ 7 నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. సెలవు దినాల్లో అత్యవసర కేసులను 8న దాఖలు చేసుకోవాలని, 11న వాటిని జస్టిస్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం, జస్టిస్ అభిషేక్‌రెడ్డి విచారిస్తారని తెలిపారు. 18న తిరిగి హైకోర్టు ప్రారంభం తరువాత యథావిధిగా కేసులు విచారణ కొనసాగుతాయని తెలిపారు.