ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్

తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళను ఫిబ్రవరి 1 నుంచి రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి సెలవుల తర్వాత కరోనా కారణంగా పొడిగించిన సెలవులు ఈనెల 30తో ముగుస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. స్కూళ్ళు తెరుచుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే స్కూళ్ళల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *