పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో కొత్త కోర్సులు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో కొత్త కోర్సులు
హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. ఇందులో (MFA) ఎంఎఫ్ఏ (మాస్టర్స్ ఇన్ శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్), ఎంఏ (చరిత్ర, టూరిజం) కోర్సులు ఉన్నాయి. ఎంఫిల్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కోర్సులకు సంబంధించిన వివరాలను విద్యార్థులు అక్టోబర్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ వర్సిటీ అధికారులు తెలిపారు. వివరాలకు www.teluguuniversity.ac.in, www.pstucet.org వెబ్సైట్లను చూడాలని సూచించారు.