గర్భగుడి వెనక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా..?

గర్భగుడి వెనక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా..?

గర్భగుడి వెనక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా..?

చాలా ఏళ్ల నుండి వస్తున్న సంప్రదాయం..?

పుణ్యం వస్తుందని…? 

ఆచార్య వ్యవహారాలను పాటించడం మన పూర్వీకుల నుంచి వస్తున్నదే.. దేవాలయాల్లో సాధారణంగా భక్తులందరూ గుడి వెనక ఉన్న భాగాన్ని అందరూ మొక్కుతుంటారు. కానీ దాని వెనకున్న అంతర్థార్ధం అందరికీ తెలియదు. గుడి చుట్టూ ప్రదక్షణ చేస్తూ ప్రతిసారి మొక్కుతూనే ఉంటారు. అయితే కొంతమంది 101 సారి, 111 సార్లుతో పాటుగా..భక్తులు మొక్కున్న సార్లు గర్భగుడి వెనకాల ఉన్నగోడను తాకుతూ ఉంటూ వారి మొక్కులను తీర్చుకుంటారు.

అయితే ఈ సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి వస్తోంది కాబట్టి ఆచారం కొద్దీ అలా ఆచరించి వెళ్లిపోతారు. భక్తులందరూ మంచి జరగుతుందని వారి మూఢ నమ్మకం. అంతే తప్ప.. దానివెనకున్న రహస్యం మాత్రం తెలియదు. అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం ఉందని పురాణ గ్రంథాలు, వేదాల్లో వల్లించబడ్డాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని వెనక ఉన్న పరామర్థం ఏమిటో తెలుసుకుందా మరీ..

ఏ దేవాలయంలోనైనా మూలవిరాట్టు ఉండే గర్భాలయం ప్రశస్తమైంది. ఈ గర్భాలయంలో మూల విరాట్టుని గోడల మధ్యగా కాకుండా, వెనుక గోడకి దగ్గరగా ప్రతిష్టించాలని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే మూలవిరాట్టు  గోడకి కొంత గ్యాప్ అనేది ఉంచుతారు.

దేశంలో ఏ దేవాలయంలోనైనా మనం గుడిని ప్రతిష్టించేటప్పడు.. శాస్త్రాల్లో చెప్పిన విధంగా, పిఠాధిపతులు చెప్పిన విధంగా గుడిని కట్టడం జరుగుతుంది. అయితే ఆ గుడికి మంత్రోఛ్చారణతో చేసిన యంత్రం అనేది ప్రతిష్టించే విగ్రహాని కింద ఉంచుతారు. అయితే ఆగుడిలో ఉంటే విగ్రహానికి రోజు పూజారి రోజు దూపదీప నైవేద్యాలు చేస్తూ ఉంటారు. ఆ గుడిలో ఉండే పూజారి హారతి, పువ్వులు, నైవేద్యం నిత్యం మంత్రోఛ్చారణ చేయటం వలన భగవంతుని పాదపీఠం కింద ఉన్న యంత్రంలోనికి “మంత్రశక్తి” ప్రవేశిస్తుంది. దీనితో ఆ విగ్రహానికి ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్ర శక్తి వల్లే భగవత్ విగ్రహం నుంచి “ తపో కిరణాలు” నాలుగు దిక్కులా ప్రసరిస్తాయి. దీంతో ఆ గుడి ఉంతా తేజోవంతమవుతుంది. చుట్టుప్రక్కలా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న పీడ శక్తులు హరించిపోతాయి. అందుకే మనం వేగువ జామునే భగవంతుని నీడలో పూజా కార్యక్రమం చేసుకుంటే మంచిది. దీని వల్ల కుటుంబంలోని అందరూ ఆర్యోగంగా మరియు అన్ని రంగాల్లో కలిసి వస్తుందని పురాణాల్లో వల్లించబడ్డాయి.. దీని ప్రకారము మనందరం పాటిస్తూనే ఉన్నాము.

ఈ మంత్ర శక్తికి అత్యంత సమీపంగా ఉండేది గర్భాలయంలో వెనుక వైపుగోడ. అందుకే ఆ గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు అక్కడ ఆగినప్పుడు “తపో శక్తిని”  పొందడానికి వీలుగా వుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ వెనక భాగాన్ని మొక్కుతారట. ఈ విషయం అందరికీ తెలియదు.

అయితే శనీశ్వరుడు ఉన్న దేవాలయంలో వెనక భాగాన్ని తాకరట… ఇదే కూడా ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయమే మరీ.. ఇది ఎంత వరకు నిజమో తెలియదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *