గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా..?

గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా..?

గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా..?

హిందూ దేశాల్లో తరుచుగా దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తులు గుడిలో ఉన్న గంటను మోగిస్తారో ఎవరికి తెలియదు. సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, మనసులో భగవంతుణ్ని ధ్యానించుకుంటారు.

గంటను ఎందుకు కొడుతున్నారో ఎవరికీ తెలియదు…ఏదో గుడిలో గంట వుంది కదా అని అలా మోగించి వెళ్లిపోతారే తప్ప.. దాని వెనకాల వుండే పరమార్థం మాత్రం తెలిసి వుండదు. మరి.. అలాంటప్పుడు గంట ఎందుకు మోగిస్తామో తెలుసుకుందామా..

గంట మ్రోగించడం ద్వారా వెలువడే శబ్దం మంగళకరమైన ధ్వనిగా పరిగణించబడుతుంది. ఇది విశ్వానికంతా భగవన్నామమయిన ‘ఓంకార’ నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని దర్శనం పొందడానికి బాహ్యా ప్రపంచంలో ఉన్న అందరినీ పూనీతం అవుతుందట. అందుకే గంట మ్రోగిస్తాం. క్రియా పరంగా ‘హారతి’ ఇచ్చే సమయంలో కూడా గంట వాయిస్తారు. ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోను మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది.  మ్రోగే గంట, శంఖము, ఇతర వాయిద్యాలు భక్తులను తమ భక్తి పారవశ్యత, ఏకాగ్రత, అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ, అసంగతమైన శబ్దాలు, వ్యాఖ్యానాల నుండి బయట పడడానికి సహాయ పడతాయి.

గంట భాగాల్లో ప్రత్యేకతలేంటి..?

మన పురాణ గ్రంథాల్లో చెప్పబడిన విధంగా గంటలో ఉండే ప్రతి భాగానికి ఓ ప్రత్యేకత ఉంది.  గంట నాలుకలో సర్వస్వతీ దేవి, గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రడు, కొన భాగంలో వాసుకీ అనే దేవుడు, పిడిభాగం లో గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటాయని ఇతిహాస్యాలలో చెప్పబడ్డాయి.

హారతి సమయంలోనే గంట ఎందుకు కొట్టాలి..?

హారతి సమయంలో దేవతందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే గంట కొడతారు. పురాణాల్లో చెప్పబడిన విధంగా గుడిలో హారతి ఇస్తున్న సమయంలో ప్రతిష్టించ బడిన దేవుడితో పాటుగా మిగతా దేవుళ్లకు కూడా హారతి ఇస్తూ ప్రతిష్టించబడిన విగ్రహాన్ని ఆ వెలుగులో పూజారి   చూపిస్తుంటారు. అందుకే గుడిలో ఉండే పూజారి హారతి ఇచ్చే టైంలో భక్తులు ఎవరూ మాట్లాడకుండా,కళ్లుమూసుకోకుండా దేవుడిని మనస్సులో తలచుకోవాలని చెబుతారు.

సాధారణంగా దేవాలయాల్లో కంచు, ఇత్తడి, పంచలోహాలతో చేసిన గంటలు వాడుతుంటారు. కంచుతో తయారు చేసిన గంటను కొడితే “ఓం” అనే స్వరం వినిపిస్తుందని పురాణల్లో చెప్పబడ్డాయి.

కొన్ని దేవాలయాల్లో గంటలను గుత్తులు, గుత్తులుగా ఒకే తాడుకి కట్టి తగిలిస్తారు. అనుకున్న పని త్వరగా నెరవేరుతుందని భక్తుల యొక్క మూడ విశ్వాసం.

 (పూజ ఆరంభములో ఇలా చెబుతూ గంటను మ్రోగించాలి)

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కురుఘంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం

భావం : దైవాన్ని ప్రార్ధిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను.  దాని వలన సద్గుణ దైవీపరమయిన శక్తులు నాలో ప్రవేశించి (నా గృహము, హృదయము) అసురీ మరియు దుష్టపరమైన శక్తులు బాహ్యాభ్యంతరాల నుండి వైదొలగు గాక…. నాకు కలిగే నరపీడ దోషాలను హరించాలని మనస్సులో అనుకొని గంటను మ్రోగించాలట. పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డాయని పెద్దలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *