ఉత్తర భారత రాష్ట్రాలను ముంచెత్తిన వానలు

ఉత్తర భారత రాష్ట్రాలను ముంచెత్తిన వానలు
  • ఉత్తర భారత రాష్టాలను ముంచెత్తిన వానలు
  • పిడుగుపడి 68 మంది..యూపీలో 41 మంది, రాజస్థాన్ లో 20మంది మృతి
  • ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్ష బీభత్సం
  • పలు రాష్ట్రాల్లో నిలిచిన రవాణా, విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థ
  • అంధకారంలో పలురాష్ట్రాలు,
  • భీభత్సంతో సహాయక చర్యలకు ఆటంకం
  • డ్యామ్ గేట్లు ఎత్తడంతో పలు గ్రామాలు మునక
  • సహాయక చర్యల్లో పాల్గొంటున్న విపత్తు నిర్వహణ సిబ్బంది

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. చాలా మంది పిడుగు పాటుకు చాలా మంది బలవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోనే మొత్తం 41 మంది మృతి చెందారు. మృతుల్లో ప్రయాగ్ రాజ్ జిల్లాలో 14 మంది, అందులో ఎక్కువమంది మహిళలు, చిన్నారులే ఉండం విశేషం. మృతుల కుటుంబాలకు ఆదుకునేందుకు సీఎం యోగి ఆదిత్య నాథ్ రూ.5లక్షల చొప్పున పరిహారం అందించారు.

దీనిపై ఆరా తీసిన ప్రధాని మోడీ  మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు PNRF నుంచి రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.

మరోవైపు రాజస్థాన్ లో వేర్వేరు ఘటనల్లో 20మంది పిడుగుపాటుకు బలయ్యారు. జైపూర్ లోని అమేర్ ప్యాలెస్ వాచ్ టవర్ ను చూసేందుకు వచ్చిన పర్యాటకులు సెల్ఫీలు దిగుతుండగా పిడుగు పడటంతో 11 మంది అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో 35మంది గాయపడ్డారు. పిడుగుపాటు భయానికి మరి కొంతమంది పక్కనే ఉన్న లోయలో పడ్డారు. విషయం తెలుసుకన్న రెస్క్యూటీం వారిని రక్షించి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్ర్భాంది చెందారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం అందచేయాలని ఆదేశాలిచ్చారు.

ఇటు మధ్యప్రదేశ్ లో పిడుగుపాటుతో ఏడుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో మొత్తం 68మంది మృతి చెందినట్లు విపత్తులశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 2004 నుంచి దాదాపు పిడుగుపాటుతో దాదాపు ప్రతియేటా 2వేల మంది మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే పిడుగులు పడటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఓ సర్వేలో వెల్లడైంది.

మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో వర్షభీభత్సంతో వంతెనలు కుప్పకూలాయి. వర్ష బీభత్సానికి టెలిఫోన్, రహదారులు పాడైపోయాయి. బెంగాల్ లో సీఎం మమత బెనర్జీ ఎరియల్ సర్వే నిర్వహించింది. వరద, పంట నష్టంపై ప్రధాని మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడారు. వారికి కావాల్సిన సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు. దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ (DVC) పై ప్రధానికి కంప్లైంట్ చేసింది. ప్రభుత్వానికి తెలియకుండా డ్యామ్ గేట్లు తెరవడంతోనే ఈ ఉధృతికి కారణమంటూ ఆమె ప్రధానికి వివరించారు.

దాతియా జిల్లాలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వరదలో చిక్కుకున్నారు. వెంటనే అక్కడున్న రెస్కూ సిబ్బంది ఆయనను కాపాడింది. వరద సహాయక చర్యలో ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ దళాలు పాల్గొన్నాయి.

మరోవైపు జమ్మూకశ్మీర్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జమ్ములో  వర్షం భీత్సాన్ని సృష్టిస్తోంది 8 మంది మృతితో పాటు 17మంది గల్లంతు. వరదల్లో చిక్కుకుపోయిన 17మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.

ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్నాథ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో రహదారులు జలయమం కావడంతో రహదారులు, జనజీవనం స్థంభించిపోయింది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *