మీ ఇంట్లో ఈ చిట్కాలు పాటించండి..

మీ ఇంట్లో ఈ చిట్కాలు పాటించండి..

దోశలు మెత్తగా రావడం లేదా? బియ్యం రవ్వ/బొంబాయి రవ్వను కప్పు తీసుకుని జావకాచి చల్లార్చి దోశ పిండిలో కలపండి.

కాచిన నెయ్యిలో నాలుగు మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది.

వెన్న కాచేటప్పుడు నెయ్యి తాజాగా ఉండి మంచి వాసన వస్తు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే గిన్నెలో ఒక తాజా తమలపాకు వేసి కాచితే సరి.

పాలలో మీగడ ఎక్కువగా రావాలంటే కాచడానికి ముందు పాల గిన్నెను చల్లటి నీటిలో ఉంచండి.

పుదీనా కొత్తిమీర చెట్నీ చేసేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

క్యాబేజీ కూర వండేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది.

కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.

కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, డీకాషిన్ లో  ఉప్పు వేసి చూడండి.

వెల్లుల్లిని ఫ్రీజులో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి, పొట్టుకూడా సులువుగా వస్తుంది.

బియ్యం నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేస్తే పురుగులు పట్టవు.

వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలను వేస్తే, మంచి వాసన వస్తుంది.

పావుగంట పాటు వేడి నీళ్ళలో నాన పెడితే బాదం పొట్టు సులుభంగా వస్తుంది.

పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వెన్న కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.

ఒకసారి వేసిన వడలని మళ్ళి వేయిస్తుంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి, దీన్ని నివారించేందుకు వడలని ఒక నిమిషం మాత్రమే వేయించండి. ఆ వెంటనే tissue కాగితంపై ఉంచండి. అధిక నూనె సమస్య ఉండదు, వడలు కరకరలాడతాయి.

ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.

ఆపిల్ ముక్కల మీద నిమ్మ రసం రాస్తే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.

సగానికి కోసిన ఆపిల్ ముక్కలు నల్లగా రంగు మారకుండా ఉండాలంటే, తెల్లని బాగంలో ఉప్పు రాయాలి.

మరీ జిడ్డు పేరుకుపోయిన పాత్రలను తోమడానికి ఉప్పులో ముంచిన నిమ్మ చెక్కలతో తోమి పాత పత్రికలతో రుద్దితే సరి

ఆకు కూరలు ఉడికించిన నీటిని వృధాగా పారెయ్యకుండా soup ల తయారీలో వాడుకోవచ్చు.

ఫ్లాస్కులని ఎంత సుభ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరి.

బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.

మరీ నిల్వ ఉంచిన సెనగపిండిని పారవేయ్యకుండా స్టీలు గిన్నెలు వెండి సామాన్లను తోమితే చక్కగా సుబ్రపడతాయి.

వంట గదిలో చీమలు బారులు తీరాయా? అయితే అవి ఉన్న చోట నిమ్మరసం చల్లండి.

కూరల్లో పులుసులో ఉప్పు కారం ఎక్కువైనప్పుడు రెండు చెంచాల సెనగపిండిని వేయించి కలిపితే సరిపోతుంది.

అరటి, బంగాళ దుంప ముక్కల మీద ఉప్పు నీళ్ళు చల్లి పావుగంట అయ్యాక వేపుడు చేస్తే ముక్కలు బాగా వేగుతాయి.

వెల్లుల్లి రెబ్బల్ని గంటపాటు నీళ్ళల్లో నాన పెట్టి పొట్టు తీస్తే సులువుగా వస్తాయి.

ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక తడి చేత్తో అద్దితే సరిపోతుంది.

గుడ్లను ఉడికించే నీళ్ళల్లో రెండు చెంచాల వినెగర్ కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.

పిండి వంటలు చేసేటప్పుడు బాణలిలో నూనె పొంగ కుండా ఉండాలంటే, మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి చూడండి …

అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.

మిగిలిపోయిన బ్రెడ్ను కాసేపు ఓవెన్ లో ఉంచి పొడి చేసి పులుసులో వేసుకుంటే రుచిగా ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *