TTD: అక్టోబర్ 7న వీఐపీ దర్శనం రద్దు
తిరుమలలో ఈనెల 7న వీఐపీ దర్శనం రద్దు
తిరుమల: అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించిన అనంతరం.. వీఐపీ బ్రేక్ దర్శనం నిలివేశారు. ఇక 7వతేది కూడా వీఐపీ దర్శనం నిలివేస్తున్నట్లు టీటీడీ ధర్మకర్తల మండలి తెలిపింది.
అక్టోబర్ 6న ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసిన టీటీడీ. గురువారం ధ్వజారోహణం కారణంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు జరుగుతాయని, ఈ క్రమంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపిన టీటీడీ. వీఐపీలు, భక్తులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని సహకరించాలని కోరిన టీటీడీ. అదే రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుండటంతో వీఐపీ దర్శనం నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రతి ఏటా వేలాదిగా ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో.. ఈసారి కొవిడ్ నిబంధనల మధ్య స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.