ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం వారం రోజుల పాటు మాత్రమే పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను జరపపాలని టీడీపీ డిమాండ్ చేసింది. అలాగే, కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలకు ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. కాగా.. తొలి రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.