టోక్యో ఒలింపిక్స్ లో మరో స్వర్ణం సాధించిన ఇండియా

టోక్యో ఒలింపిక్స్ లో మరో స్వర్ణం సాధించిన ఇండియా
ప్రపంచ పటంలో భారత్ ను మరోసారి కీర్తిని ఇనుమడింప జేశారు మన క్రీడాకారులు.. టోక్యో పారాలింపిక్స్ లో ఇండియా అథ్లెట్లు ఎవరూ ఉహించని విధంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. పారాలింపిక్స్ లో ఇండియా రెండో గోల్డ్ సాధించింది. ఉదయం అవని లెఖారా రైఫిల్ షూటింగ్ లో స్వర్ణ పతకం సాధించి భారత్ పతాకాన్ని ఎగురవేసి భారత్ కీర్తిని నిలబెట్టింది. అయిదే ఇప్పుడు అదే స్పూర్తితో సుమీత్ ఆంటిల్ జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించాడు. ప్రపంచ చరిత్రలో మన దేశ రికార్డును ఇనుమడింపజేశాడు..అయితే సుమీత్ సాధించిన ఈ రికార్డు ప్రపంచ రికార్డుగా నమోదు అవ్వగా.. 3 నిమిషాల వ్యవధిలోనే తన రికార్డును తానే తిరగ రాశాడు సుమీత్.
ఇక అవనీ లెఖారా రైఫిల్ షూటింగ్ లో స్వర్ణం గెలిస్తే జావెలిన్ త్రోలో సుమీత్ ఆంటిల్ మరో గోల్డ్ కొట్టి భారత్ కీర్తి పతకాన్ని మరలా ఎగుర వేశాడు. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ లో భవీనా పటేల్ రజతం సాధించగా, హైజంప్ లో నిషాద్ కుమార్ రజత పతకం గెలిచాడు.