టోక్యో పారా ఒలింపిక్స్ , భారత్ ను వరించిన పతకాలు

టోక్యో పారా ఒలింపిక్స్ , భారత్ ను వరించిన  పతకాలు

టోక్యో పారా ఒలింపిక్స్ ముగింపు, భారత్ ను వరించిన పతకాలు

పాల్గొన్న మొత్తం 54 మంది అథ్లెట్లు

మొత్తం 17 హేడు పతకాలు 

టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి మొత్తం 54 మంది అథ్లెట్లు…9 అంశాల్లో పోటీపడ్డారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మన క్రీడాకారులు ప్రపంచపటంలో మన జాతీయ పతకాన్ని గర్వంగా ఎగురవేశారు. ప్రపంచ చరిత్ర స్థాయిలో నిలిచి పోయేవిధంగా 17 హేడు పతకాలు సాధించారు మన క్రీడాకారులు. టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్యాలు కలిపి మొత్తం 17 పతకాలు సాధించారు. జపాన్ లోని టోక్యోలో ఆగస్టు 24న ప్రారంభమైన ఈ పారా ఒలింపిక్స్‌ క్రీడలు ఇవాళ్టితో ముగియనున్నాయి.

టోక్యో పారా ఒలింపిక్స్‌ క్రీడల్లో షూటర్ 19 ఏళ్ల అవని లేఖర..10 మీటర్ల రైఫిల్‌ స్టాండింగ్ SH1లో బంగారు పతకం, 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌ SH1లో కాంస్యం సాధించింది. అయితే ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున 2 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది షూటర్ అవని లేఖర. టోక్యో ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతకాన్ని చేతబట్టి గర్వంగా ముందుకు సాగనుంది. టోక్యోలో ప్రమోద్ భగత్ పారా-బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలిసారిగా పతకాన్ని అందించి రికార్డులకెక్కాడు.

సింగిల్స్ బ్యాడ్మింటన్ SSL3 ఈవెంట్‌లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డేనియల్ బెథల్‌ పై పోరాడి ప్రమోద్ భగత్ (33ఏళ్ల)గెలిచి బంగారు పతకాన్ని భారత్ కు అందించారు. పారాలింపిక్స్ లో బంగారు పతకాన్ని గెలిచి తొలి భారతీయుడిగా నిలిచారు. 4 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ బంగారు పతక విజేత అయిన ప్రమోద్ భగత్ ఈసారి సింగిల్స్ బ్యాడ్మింటన్ SSL3 ఈవెంట్‌లో  45 నిమిషాల్లోనే డేనియల్‌పై 21-14, 21-17 వరుస సెట్లతో విజయం సాధించాడు.

టోక్యో పారా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులపై.. దేశవ్యాప్తంగా అభిమానుల ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రమోద్ భగవత్ దేశ వ్యాప్తంగా ఈ విజయం ఎన్నో లక్షల మందిని చైతన్య పరుస్తుందని ప్రధాని మోడీ ప్రసంశల వెల్లువ కురిపించారు. బ్యాడ్మింటన్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు భగవత్ ని అభినందిస్తూ.. భవిష్యత్ లో కూడా రాణించాలని కోరుకుంటూ ట్విట్ చేశారు ప్రధాని మోడీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *