టోక్యో పారాలింపిక్స్ లో సిల్వర్ సాధించిన భారత్

టోక్యో పారాలింపిక్స్ లో సిల్వర్ సాధించిన భారత్

టోక్యో పారాలింపిక్స్ లో సిల్వర్ సాధించిన భారత్

టోక్యో పారాలింపిక్స్ లో ఇండియా తొలి పతకాన్ని సాధించింది. రసవత్తరంగా సాగిన ఆటలో పోరాడి గెలిచిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా బెన్ పటేల్ సిల్వర్ మెడల్ గెలిచారు. మహిళల టేబుల్ టెన్నిస్ క్లాస్ 4వ విభాగం ఫైనల్లో చైనా ప్లేయర్ యింగ్ జోవుతో తలపడిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్. ప్రారంభంలో ఆట మొదలు కాగానే 0-3 తో భవీనా ఓడిపోయింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే పారాలింపిక్స్ హిస్టరీలో టేబుల్ టెన్నిస్ లో భారత్ కు ఇదే ఫస్ట్ మెడల్ గా చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఒలింపిక్స్ లో భారత్ కు పతాకాల పంట పండుతోందని పలువురు భవీనా పటేల్ ను అభినందించారు. దీనిపై ప్రసంశల వర్షం సోషల్ మీడియాలో వస్తున్నాయి.

టేబుల్ టెన్నిస్ లో భవీనా సిల్వర్ మెడల్ గెలవడంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. భవీనా పటేల్ టోక్యోలో గెలిచి ఇండియా చరిత్రను సృష్టించారని… భవీనా జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని కొనియాడారు. గెలిచిన నేపథ్యంలో గుజరాత్ మెహసానాలో భవీనా ఇంటి దగ్గర గార్బా డ్యాన్స్ చేస్తూ టపాసులు  కాల్చి, మిఠాయిలు తినిపించుకుంటూ..మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు కుటుంబసభ్యులు.. అయితే భవీనా తమను, దేశం గర్వపడేలా చేసిందని… ఆమెకు ఘనస్వాగతం పలుకుతామని కుటుంబ సభ్యులు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *