టాలీవుడ్ లో రానున్న సినిమాలు

టాలీవుడ్ లో రానున్న సినిమాలు

టాలీవుడ్ లో రానున్న సినిమాలు

కరోనా కారణంగా సినిమాలు, సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతాయో లేదో తెలియదు కానీ.. ఇప్పటి పరిస్థితులను ఓటీటీలలో రిలీజ్ అవుతున్నాయి..సో.. పరిస్థితులు బాగున్నప్పుడే సినిమా షూటింగ్స్‌ పూర్తి చేసుకునే దిశగా చిత్రయూనిట్లు పోటీపడుతున్నాయి. అయితే థియేటర్లు ఓపెన్‌గా ఉన్నప్పుడే అభిమానుల మనసులను సొంతం చేసుకునేందుకు సినిమా విడుదల తేదీలు కొన్ని చిత్రయూనిట్లు ప్రకటించేస్తున్నాయి. పలు చిత్రాలు ఏంటో ఒకసారి చూద్దామా మరీ..

 

పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ లో యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘18 పేజీలు’ చిత్రీకరణ పూర్తైయింది. అయితే ఈ సినిమాలో నిఖిల్ తో అనుమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ కొత్త లుక్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం రికార్డింగ్ నడుస్తోందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాలో అరకొర సన్నివేశాలలో డైలాగులు ప్రేక్షుకుల్ని అలరించేలా ఉన్నాయట. ఈ సినిమాలో త్వరలో విడుదల కానుందని చిత్ర యూనిట్ తెలిపింది.

డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా డైరెక్షలో నిర్మిస్తోన్న చిత్రం “ మేజర్ “ ఈ చిత్రం చివరి షెడ్యూల్ పూర్తికానుంది. ఈ కథ ముంబై టెర్రిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజేర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తీసే చిత్రమే ఇది. ఈ సినిమాలో హీరోగా అడవి శేషు, సయి మంజ్రేకర్, హీరోయిన్ శోభిత దూలిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి మురళీశర్మ నటిస్తున్నారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఆకట్టుకొంటుంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు భేష్ అంటూ చిత్రయూనిట్ ను మెచ్చుకుంటున్నారు. జీఎమ్బీ ఎంటర్ టైన్ మెంటట్, ఏ ఫ్లస్ ఎస్ మూవీస్ సంస్థల అసోయేషన్ తో సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రమే మేజర్..అయితే ఈ సినిమాను తెలుగు, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

“మళ్లీ” మొదలైందీ.. ఈ చిత్రం కుంటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో సన్నివేశాలు ` విడాకులు తీసుకోవడం.. మళ్లీ పెళ్లి చేసుకోవడం` అనే అంశాల రూపంగా చిత్రం రూపుదిద్దుకోబోతుంది. ఈ సినిమాలో హీరోగా అక్కినేని సుమంత్, హీరోయిన్ నైనా గంగూలీ నటిస్తోంది. ఇందులో పోసాని కృష్ణ మురళీ కుటుంబరావు అనే పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా మొత్తం  అయితే ఈ సినిమాలో తల్లి క్యారెక్టర్ లో సుజగా మరియు వ్యాపార వేత్తగా నటించబోతుందట. ఈ చిత్రంలో సుజా అనే పాత్ర తల్లి క్యారెట్టర్ లో నటిస్తోందట.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ టీజీ కుమార్ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా అనూప్ రూబెన్స్ స్వరాలు అందిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *