ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ ఎల్పీ భేటీ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ అభ్య‌ర్థులు శాలువా క‌ప్పి పుష్పగుచ్ఛాలు అందించి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ కలెక్టర్ వెంక‌ట్రామిరెడ్డి, త‌క్కెళ్ల‌ప‌ల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ మంగ‌ళ‌వారం అసెంబ్లీ సెక్ర‌ట‌రీకి నామినేష‌న్ల‌ను స‌మ‌ర్పించగా అధిష్టానం వీరిని ఖరారు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *