TS: ఆగస్టు 30నుంచి ఎంసెట్ తొలి దశ కౌన్సెలింగ్

తెలంగాణలో ఆగస్టు 30నుంచి ఎంసెట్ తొలి దశ కౌన్సెలింగ్
తెలంగాణలో మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, 2021తొలి దశ ప్రవేశాల కౌన్సెలింగ్.. ఆగస్టు 30 నుంచి ప్రారంభించాలని TS ఎంసెట్ 2021 అడ్మిషన్స్ కమిటీ నిర్ణయించింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించిన అడ్మిషన్స్ కమిటీ.
ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు సర్టిఫికెట్ల ఆన్ లైన్ లో స్లాట్ బుకింగ్, సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు.. సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 15 నుంచి 20లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్ లైన్ ద్వారా రిపోర్టు చేయాలి. మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ https://tseamcet.nic.ina లో ఆగస్టు 28 నుంచి లభించనుట్లు అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు.