తెలంగాణ ECET ఫలితాలు విడుదల..24 నుంచి కౌన్సెలింగ్

తెలంగాణ ECET ఫలితాలు విడుదల..24 నుంచి కౌన్సెలింగ్

TS ECET ఫలితాలు విడుదల..24 నుంచి కౌన్సెలింగ్

తెలంగాణ ఈసెట్‌-2021 ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి. అయితే ఆగస్టు 3న జరిగిన ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్ష రాసిన వారిలో 95.16 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు తెలంగాణ ఈసెట్-2021 నిర్వహించారు. అయితే విద్యార్థుల తమ ర్యాంకుల కార్డులను చూసుకోవాలంటే.. https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆగస్టు 24 నుంచి కౌన్సెలింగ్‌

ఆగస్టు 24 నుంచి ఈసెట్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని.. ఆగస్టు 26 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలిన ఉంటుందని.. ఈ నెల 26 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులకు సెప్టెంబర్ 2న సీట్లు కేటాయిస్తామని.. సెప్టెంబర్ 2 నుంచి 7వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందిగా అధికారులు విద్యార్థులకు సూచనలు చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఈసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ఉంటుందని… సెప్టెంబర్‌ 18న స్పాట్‌ అడ్మిషన్స్‌కు సంబంధించి మార్గదర్శకాలు జారీచేస్తామని పాపిరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: