తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

జేఎన్టీయూలో తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, జెఎన్టీయు వైస్ ఛాన్సలర్ కట్ట నర్సింహా రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లోనూ ఎంసెట్ నిర్వహించాము. ఆ టైమ్ లో కూడా విద్యార్థులు సహాకరించి ఎంసెట్ రాశారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా ప్రభావం అన్ని  రంగాలపై పడిందని దీంతో అన్ని కుదేలు అయ్యాయని  మంత్రి సబితా అన్నారు. దీనిలో భాగంగా విద్యా వ్యవస్థపై మరింత ప్రభావితమైందని ఆమె అన్నారు. ఈ సారి రాసిన ఎగ్జామ్స్ లో 28 వేల మంది విద్యార్థులు అదనంగా పరీక్షలు రాశారని మంత్రి తెలిపారు.  జేఎన్టీయూ ఆన్ లైన్ ద్వారా పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని మంత్రి అన్నారు. అయితే జెఎన్టీయూ బృందానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 30 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. అయితే ఆగష్టు 4, 5, 6, 10, 11 తేదీలలో ఎంసెట్ నిర్వహించారు. అగ్రికల్చర్, మెడికల్ బల పరీక్షకు 91.19 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారయ్యారని..వీరిలో 98.48 శాతం మంది పరీక్షకు అర్హత సాధించారు. మెడికల్ ఎగ్జామ్ లో హైదరాబాద్ బాలానగర్ కు చెందిన మండవ కార్తీకేయ ఫస్ట్ ర్యాంకు సాధించాడని.. రంగారెడ్డి జిల్లాకు చెందిన హిమని శ్రీనిజ రెండో ర్యాంక్ సాధించిందని తెలిపారు.

ఇంజినీరింగ్ విభాగంలో 82.07శాతం మంది అర్హత సాధించారు. అయితే ర్యాంక్ సాధించిన వారిలో ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించారు. పశ్చిమ గోదావరికి చెందిన సత్తి కార్తికేయ ఫస్ట్ ర్యాంకు, కడపకు చెందిన వెంకట ప్రణీత్ రెండో ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన ఎండీ మతీన్ మూడో ర్యాంకు సాధించారు. అయితే ఫలితాలు https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *