TS: స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్

TS: స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్

తెలంగాణ  స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ అధ్యక్షుడిగా సునీల్ నారంగ్

హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్ 76వ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రాబోయే రెండేళ్లు (2021-23)కి గానూ కొనసాగబోయే కొత్త కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా బాల గోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్. శ్రీధర్, ఎ. ఇన్నారెడ్డి ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కె. అనుపమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జె. చంద్రశేఖర్ రావు, కోశాధికారిగా ప్రముఖ ఎగ్జిబిటర్ ఎం. విజయేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా బి.లింగం గౌడ్‌, పి. సుబ్ర‌మ‌ణ్యం, డి. విష్ణు మూర్తి, ర‌వీంద్ర గోపాల్‌, జి. శ్రీనివాస్‌, బి. స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌, జి. శ్రీనివాస్ రెడ్డి, చెట్ల ర‌మేశ్‌ బి. విజ‌య్ కుమార్‌, కె. ఉద‌య్ కుమార్ రెడ్డి, ఎం. న‌రేంద‌ర్ రెడ్డి, ఎం. మోహ‌న్ కుమార్‌, కె. అశోక్ కుమార్ నియమితులయ్యారు. అయితే ఈ నియామకంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని సమాచారం. ఈ సారి మా ఎన్నికల్లో ఏ ప్యానల్ గెలుస్తుందో చూడాలి మరి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: