TS: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జిలు

TS: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జిలు
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు
ప్రస్తుతం సీజేగా రామచంద్రరావు..?
అందులో నలుగురు మహిళా న్యాయవాదులు
సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. కొలిజియం పంపి లిస్టులో తొలుతగా హైకోర్టు సీజేగా పదవీ విరమణ చేయనున్న జస్టిస్ హిమాకోహ్లీకి పదోన్నతి ఇవ్వాలని కొలిజియం సిఫారస్సు చేసింది. ఆమె సెప్టెంబర్ 2న హైకోర్టు సీజేగా పదవీ విరమణ చేయనున్నారు. కొలిజియ సిఫారస్సుతో ఆమె మరో మూడేండ్లపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు.
ఇదే క్రమంలో కొలిజియం సిఫారసు చేసిన సీనియర్ న్యాయవాదుల్లో జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు ఒకరు. అయితే హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం జరిగే వరకూ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వహించేలా కొలిజియం సిఫారసు చేసింది.
అయితే కొలీజియం సిఫారసులను కేంద్ర సర్కార్ రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుంది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ పరిశీలించి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది. గెజిట్ లిస్ట్ విడుదల అనంతరం కొత్త న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరిస్తారు.
కొలిజియం సిఫారసులు చేసిన వారిలో న్యాయమూర్తులు పీ శ్రీసుధ, ఎం లక్ష్మణ్, ఎన్ తుకారాంజీ, డాక్టర్ జీ రాధారాణి, డాక్టర్ సీ సుమలత, ఏ వెంకటేశ్వర్‌రెడ్డి సీనియర్లుగా ఉన్నారంటూ వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా చేయాలని కొలిజియం సిఫారస్ చేసింది. అయితే వీరితో పాటుగా ఇన్ కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలిగా ఉన్న పీ.మాధవీదేవిని కూడా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కొలీజియం సిఫారసు చేసింది. లైఫ్ హిస్టరీ ప్రకారం ఈమెపై ఎటువంటి ఆరోపణలు లేని కారణంగా ఈమె పేరును హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కొలీజియం సిఫారసు చేసింది.
అయితే తెలంగాణలో చాలాకాలంగా జిల్లా జడ్జీల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించలేదు. దీంతో హైకోర్టులో ఖాళీలు ఉన్నప్పటీకీ పూర్తి చేయలేదు. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచుతామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జస్టిస్ ఎన్వీ రమణ సూచన మేరకు 42కి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకొన్నారు.
అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్తగా నియమించిన వారితో జడ్జిల పెరగనుంది. అయితే తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత ఈ 24 మందికి జిల్లా జడ్జీలకు పదోన్నతి లభించడం ఇదే తొలిసారి. అయితే ప్రస్తుతం హైకోర్టులో 12 మంది (సీజేతో కలిపి) న్యాయమూర్తులు ఉన్నారు. కొత్తగా ఏడుగురు నియమితులైతే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 18కి పెరుగుతుంది. కొలిజియం సిఫారసుతో ప్రధాన న్యాయమూర్తి నియామకం జరిగితే ఆ సంఖ్య 19కి చేరుతుంది.
కొలిజియం సిఫారసు చేసిన నలుగురు మహిళా న్యాయవాదులు
జస్టిస్ పీ.శ్రీసుధ, జస్టిస్ డాక్టర్. సీ సుమలత, జస్టిస్ డాక్టర్ సీ.సుమలత, జస్టిస్ డాక్టర్ జీ. రాధారాణి పేర్లను కొలిజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం హైకోర్టులో 2.40 లక్షలకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని సమాచారం. కొత్త న్యాయమూర్తుల నియామకాలతో పెండింగ్ లో ఉన్న కేసులకు సత్వర న్యాయం జరిగే అవకాశాలున్నాయని న్యాయమూర్తులు అంటున్నారు.
న్యాయవాదుల లిస్టులో సీనియర్ న్యాయవాదులు ఉన్నవారు జస్టిస్ ఎం.లక్షణ్ ఈయన ప్రస్తుతం లేబర్‌కోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. జస్టిస్ ఎస్. తుకారాంజీ ఈయన ప్రస్తుతం హైదరాబాద్ క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. జస్టిస్ ఎ.వెంకటేశ్వర్ రెడ్డి ఈయన ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
జస్టిస్ పీ.మాధవీదేవి ప్రస్తుతం 2005లో ఆదాయం పన్నుశాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) సభ్యురాలిగా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు.