తెలంగాణలో విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

తెలంగాణలో విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాఠశాల అకాడమిక్ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది తెలంగాణ సర్కార్. ఈ ఏడాది కాలంలో (2021-22) 213 రోజులు పాఠశాలలు పనిదినాలుగా ఉంటాయన్ని ప్రకటించింది తెలంగాణ సర్కార్. 47 రోజులు ఆన్ లైన్ తరగతులను పరిగణలోనికి తీసుకొని..దీని ద్వారా 116 రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ.
ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులకు ఫిబ్రవరి 25 లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని.. మార్చి లేదా ఏప్రిల్ నెలలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తెలంగాణలో పాఠశాలల చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 తేదీని ఖరారు చేశామని తెలిపింది విద్యాశాఖ.
ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి కాలం సెలవులు ఉంటాయని దీనికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని తెలిపారు. అయితే దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు, డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు, అలాగే జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయాని తెలిపారు.