TS RTC: ప్రైవేట్ పరమా..? లేక ఛార్జీల పెంపా..?

TS RTC: ప్రైవేట్ పరమా..? లేక ఛార్జీల పెంపా..?

TS RTC: ప్రైవేట్ పరమా..? లేక ఛార్జీల పెంపా..?

ఆర్టీసీ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్దన్ బాధత్యలు చేపట్టాక అధికారులతో ఆర్టీసీపై సమగ్రంగా చర్చించారు. చర్చించిన అనంతరం ఆర్టీసీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు, ఐదు నెలల్లో ఆర్టీసీ లాభాల బాటలో పడకపోతే ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారని అధికారులతో చెప్పారు. ఆర్టీసీ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తమ పని తీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి. అయితే ఆర్టీసీ యూనియన్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే.. అయితే దీనికి అనుగుణంగా సంక్షేమ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అయితే ఆ మండలిలో స్త్రీ, పురుష అధికారులతో కమిటీ ఉంటుందని తెలిపారు. వారికి ఏ సమస్యలు వచ్చినా… వారితోనే చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. అయితే ఆర్టీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్టీసీ పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే ఆ  సమావేశంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదలను సిద్ధం చేయాలని ఆదేశించారు..ఆర్టీసీ గాడిలో పడే సమయంలో.. కరోనా, పెట్రో ధరలు పెరగడం వల్ల ఆర్టీసీకి ఆదాయం గండిపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ఛార్జీలు పెంచాలన్న దానిపై…వచ్చే కేబినెట్ మీటింగ్ కు నివేదికలు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ మీటింగ్ లో చార్జీల పెంపు నిర్ణయంపై ప్రకటిస్తామని తెలిపారు సీఎం కేసీఆర్.

సీఎంకు అధికారులు వివరణ: డీజిల్, టైర్లు, ట్యూబులు, విడిభాగాల ధరలు పెరిగాయని…ఆర్టీసీ సంస్థపై ప్రతి యేటా రూ.600 కోట్ల భారం పడుతోందని.. మరియు కరోనా, లాక్ డౌన్ల వల్ల రూ.3000 కోట్ల ఆదాయం కోల్పోయామని సీఎంకు ఆర్టీసీ ఎండీతో సహా ఉన్నతాధికారులు తెలిపారు.  ఈ పరిస్థితుల్లో చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎంకు వివరణ ఇచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే కేబినెట్​ కల్లా మీ చార్జీల పెంపుపై నిర్ణయంతో తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: